Register as a Reviewer
Bison (బైసన్)

Bison (బైసన్)

17 Oct 2025
Overall Rating
6.0/10
8 Reviews

ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బైసన్". మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, అర్జున అవార్డు గ్రహీత కబడ్డీ ప్లేయర్ అయిన 'మణాతి గణేశన్' నిజజీవిత కథ ఆధారంగా ‘బైసన్’ మూవీ తెరకెక్కించారు.

Director: Mari Selvaraj
Cast: Dhruv Vikram, Anupama Parameswaran, Pasupathy, Rajisha Vijayan, Ameer

Available in:

Reviews

What critics and the public are saying about Bison (బైసన్)

Media Reviews

8 Avg: 6.0/10
Ragadi
Ragadi Youtube Channel
6

Above Average

Bison Movie Review

బైసన్ (Bison) ఒక రియలిస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా నిలుస్తుంది. Dhruv Vikram తన పాత్ర కోసం చేసిన శారీరక మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. దర్శకుడు Mari Selvaraj గ్రామీణ నేపథ్యాన్ని సహజంగా చూపించారు. కథలో క్రీడా ప్రపంచంలోని కష్టాలు, సామాజిక అసమానతలు ప్రధానంగా కనిపిస్తాయి. సహాయ నటీనటులు కూడా తమ పాత్రలకు న...

బైసన్ (Bison) ఒక రియలిస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా నిలుస్తుంది. Dhruv Vikram తన పాత్ర కోసం చేసిన శారీరక మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. దర్శకుడు Mari Selvaraj గ్రామీణ నేపథ్యాన్ని సహజంగా చూపించారు. కథలో క్రీడా ప్రపంచంలోని కష్టాలు, సామాజిక అసమానతలు ప్రధానంగా కనిపిస్తాయి. సహాయ నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం భావోద్వేగాలను ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా పట్టుకుంది. కొంతవరకు కథ ముందే ఊహించగలిగినా, ప్రదర్శనలో కొత్తదనం ఉంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే కీలక సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మొత్తం మీద ఇది క్రీడా నేపథ్యంలో వచ్చిన ఒక శక్తివంతమైన చిత్రం. కానీ స్క్రీన్ ప్లే పరంగా అంత ఇంప్రెస్ చేయలేదు. అలాగే స్టోరీ లో కథ గేమ్ కంటే, క్యాస్ట్ గొడవల గురించే ఎక్కువ చూపించారు. ఇది కథకు మైనస్ అయింది.

Oct 24, 2025 Watch
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
6

Above Average

Bison movie Review

బైసన్ (Bison) ఒక రియలిస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా నిలుస్తుంది. Dhruv Vikram తన పాత్ర కోసం చేసిన శారీరక మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. దర్శకుడు Mari Selvaraj గ్రామీణ నేపథ్యాన్ని సహజంగా చూపించారు. కథలో క్రీడా ప్రపంచంలోని కష్టాలు, సామాజిక అసమానతలు ప్రధానంగా కనిపిస్తాయి. సహాయ నటీనటులు కూడా తమ పాత్రలకు న...

బైసన్ (Bison) ఒక రియలిస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా నిలుస్తుంది. Dhruv Vikram తన పాత్ర కోసం చేసిన శారీరక మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. దర్శకుడు Mari Selvaraj గ్రామీణ నేపథ్యాన్ని సహజంగా చూపించారు. కథలో క్రీడా ప్రపంచంలోని కష్టాలు, సామాజిక అసమానతలు ప్రధానంగా కనిపిస్తాయి. సహాయ నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం భావోద్వేగాలను ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా పట్టుకుంది. కొంతవరకు కథ ముందే ఊహించగలిగినా, ప్రదర్శనలో కొత్తదనం ఉంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే కీలక సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మొత్తం మీద ఇది క్రీడా నేపథ్యంలో వచ్చిన ఒక శక్తివంతమైన చిత్రం.

Oct 24, 2025 Watch
A
AP7AM Website
6

Above Average

Bison Movie Review

నిజజీవిత కథతో, రూటెడ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిన సీరియస్‌ కథాంశం ఇది. ఎటువంటి సినిమాటిక్‌ అంశాలు లేకుండా రా అండ్‌ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందక పోవచ్చు. ఇలాంటి రియలిస్టిక్‌ కథకు కథలో సోల్‌ లోపించకుండా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, మరిన్ని కమర్షియల్‌ వాల్యూస్‌...

నిజజీవిత కథతో, రూటెడ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిన సీరియస్‌ కథాంశం ఇది. ఎటువంటి సినిమాటిక్‌ అంశాలు లేకుండా రా అండ్‌ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందక పోవచ్చు. ఇలాంటి రియలిస్టిక్‌ కథకు కథలో సోల్‌ లోపించకుండా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, మరిన్ని కమర్షియల్‌ వాల్యూస్‌ యాడ్‌ చేసి ఉంటే 'బైసన్‌' అందరిని ఆకట్టుకునే అవకాశం ఉండేది. సినిమాలో కథ కంటే భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కుటుంబ నేపథ్యంతో సాగిన కథ ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. పాటలు మధురంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ మంచి స్థాయిలో ఉన్నాయి. కొంతవరకు కథ ముందే ఊహించగలిగినదే అయినా, ప్రదర్శన కారణంగా సినిమా ఆకట్టుకుంటుంది.

Oct 24, 2025 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
6

Above Average

Bison Movie Review

విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించిన సినిమా బైసన్. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను తెలుగులో అక్టోబర్ 24న విడుదల చేసారు. డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది బైసన్. సాంకేతిక విభాగం పనితీరు ఈ సినిమా స్థాయిని పెంచింది. నివాస్ కె. ప్రసన్న అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. స్పోర్ట్స్ డ్రామాకు ఆర్ఆర...

విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించిన సినిమా బైసన్. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను తెలుగులో అక్టోబర్ 24న విడుదల చేసారు. డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది బైసన్. సాంకేతిక విభాగం పనితీరు ఈ సినిమా స్థాయిని పెంచింది. నివాస్ కె. ప్రసన్న అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. స్పోర్ట్స్ డ్రామాకు ఆర్ఆర్ కీలకం. ఈ విషయంలో ప్రసన్న విజయం సాధించాడు. కబడ్డీ మ్యాచ్‌లలో, గ్రామీణ నేపథ్యాన్ని ఎలివేట్ చేయడంలో ఎజిల్ అరుసు కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. శక్తి తిరు ఎడిటింగ్ చాలా పదునుగా ఉంది. పా రంజిత్ నేతృత్వంలోని నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు మారి సెల్వరాజ్ మరోసారి మ్యాజిక్ చేసాడు. సింపుల్ కథను సరైన స్క్రీన్ ప్లేతో మాయ చేసాడు.

Oct 24, 2025 Read Review
F
FilmyFocus Website
6

Above Average

Bison Movie Review

చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటించిన చిత్రం “బైసన్”. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 1990 కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న వర్గ రణాల్ని, వాటి కారణంగా అసువులు బాసిన మనుషుల వ్యథల్ని కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. అయితే.. ఈ...

చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటించిన చిత్రం “బైసన్”. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 1990 కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న వర్గ రణాల్ని, వాటి కారణంగా అసువులు బాసిన మనుషుల వ్యథల్ని కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. అయితే.. ఈ కథకు తెలుగు ప్రేక్షకులు ఎంతవరకూ రిలేట్ అవ్వగలరు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే.. పూర్తిగా తమిళ నెటివిటీ, సంస్కృతికి అద్దం పట్టేలా ఉండడంతో.. ఈ చిత్రం సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుందా అంటే.. పూర్తిస్థాయిలో నచ్చకపోవచ్చు అనే చెప్పాలి. అయితే.. ధృవ్ విక్రమ్, పశుపతిల మాస్టర్ క్లాస్ యాక్టింగ్ & మారి సెల్వరాజ్ టేకింగ్ ను ఆస్వాదించడం కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే!

Oct 24, 2025 Read Review
Tupaki
Tupaki Website
6

Above Average

Bison Movie Review

బైసన్ సినిమా విషయానికి వస్తే మేకర్స్ మంచి క్వాలిటీతో సినిమా తీశారు. నివాస్ ప్రసన్న నేపథ్య సంగీతం సినిమాను డ్రైవ్ చేయడంలో ఉపయోగపడింది. తన పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ఎలిల్ అరసు ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్.. ఇంతకుముందు తీసిన నాల...

బైసన్ సినిమా విషయానికి వస్తే మేకర్స్ మంచి క్వాలిటీతో సినిమా తీశారు. నివాస్ ప్రసన్న నేపథ్య సంగీతం సినిమాను డ్రైవ్ చేయడంలో ఉపయోగపడింది. తన పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ఎలిల్ అరసు ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్.. ఇంతకుముందు తీసిన నాలుగు సినిమాలతో పోలిస్తే ‘బైసన్’ సాధారణంగా అనిపిస్తుంది. తన సినిమాల్లో బలమైన ఎమోషన్ ఉంటుంది. ఇందులో అది మిస్ అయింది. సాధారణమైన పాత్రలు.. సన్నివేశాలతో తన మీద ఉన్న అంచనాలను అతను అందుకోలేకపోయాడు. కుల కోణాన్ని అతను ఈసారి సరిగా ఎలివేట్ చేయకపోవడమే సినిమాకు సమస్యగా మారింది

Oct 24, 2025 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

Bison Movie Review

బైసన్ సినిమా విషయానికి వస్తే.. ధ్రువ్ విక్రమ్‌ పెర్ఫార్మెన్స్, ఆయన పాత్రతోపాటు పశుపతి ఇతర క్యారెక్టర్లను చిత్రీకరించిన తీరు ఈ మూవీకి అత్యంత బలంగా మారింది. కథ, కథనాలు మరో ప్లస్ పాయింట్, ఫస్టాఫ్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుతుంది. కానీ రెండో భాగంలో అంతా ఊహి...

బైసన్ సినిమా విషయానికి వస్తే.. ధ్రువ్ విక్రమ్‌ పెర్ఫార్మెన్స్, ఆయన పాత్రతోపాటు పశుపతి ఇతర క్యారెక్టర్లను చిత్రీకరించిన తీరు ఈ మూవీకి అత్యంత బలంగా మారింది. కథ, కథనాలు మరో ప్లస్ పాయింట్, ఫస్టాఫ్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుతుంది. కానీ రెండో భాగంలో అంతా ఊహించినట్టే సన్నివేశాలు ఉండటం కొంత మైనస్‌. తమిళ వాసన ఎక్కువగా ఉండటం తెలుగు ప్రేక్షకులకు రుచించని అంశంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఆద్యంతం కట్టిపడేసే కథనం, ఆలోచింపజేసే కథ, స్పోర్ట్స్, దేశభక్తిని రగిలించే అంశాలు ఉన్న ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. హై ఎండ్ థియేట్రికల్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది. ఎలాంటి అంచనాలు ఉన్న చక్కటి అనుభూతిని పంచే మూవీ బైసన్. ఈ వారం థియేటర్‌లో చూడటానికి, సినిమాటిక్ అనుభూతిని పొందడానికి ప్రేక్షకులకు, సినీ అభిమానులకు చక్కటి ఆప్షన్. డోంట్ మిస్ బైసన్ దిస్ వీక్.

Oct 24, 2025 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Bison Movie Review

మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన బైసన్ మూవీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా. మణాతి గణేశన్ లైఫ్ స్టైల్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ధృవ్ విక్రమ్ టైటిల్ రోల్ చేసాడు. అయితే ఆడియన్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది ఈ సినిమా. కంటెంట్ బాగున్నా, స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉండడం వల్ల, కథలో కావ...

మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన బైసన్ మూవీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా. మణాతి గణేశన్ లైఫ్ స్టైల్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ధృవ్ విక్రమ్ టైటిల్ రోల్ చేసాడు. అయితే ఆడియన్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది ఈ సినిమా. కంటెంట్ బాగున్నా, స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉండడం వల్ల, కథలో కావాల్సిన కంటెంట్ కన్నా, సమాజంలో జరిగే అసమానతలపై ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల మూవీ ఆడియన్స్ కి అంతగా రీచ్ కాదు. ఓవరాల్‌గా చూస్తే, ‘బైసన్’ చిత్రం అనచివేత, సామాజిక న్యాయం వంటి అంశాలను టచ్ చేసే స్పోర్ట్స్ డ్రామాగా పర్వాలేదనిపిస్తుంది. ధృవ్ విక్రమ్ డెడికేషన్, పశుపతి ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌లు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే, మారి సెల్వరాజ్ గతచిత్రాలతో పోలిస్తే ఈ సినిమా పెద్ద ఇంపాక్ట్ చూపెట్టలేకపోయింది. సాగదీసే రన్‌టైమ్, వీక్ రైటింగ్ వంటి అంశాలు ఈ చిత్రానికి డ్యామేజ్ చేశాయి. స్పోర్ట్స్ డ్రామాలతో పాటు సామాజిక అంశాలు ఉన్న చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

Oct 24, 2025 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

కులం పట్టింపులు, సామాజిక పరంగా గొడవలు ఎక్కువగా ఉన్న  తమిళనాడులోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన కిట్టన్ (ధృవ్ విక్రమ్) కు కబడ్డీ ఆట అంటే ప్రాణం. కానీ వాళ్ళ ఊళ్ళో ఉండే కులం పట్టింపుల వల్ల కిట్టన్ తండ్రి పెద్దగా కబడ్డీ ఆడనిచ్చేవాడు కాదు. అయితే తన స్కూల్ మాస్టర్ చొరవతో కిట్టన్ ప్రాణం పెట్టి కబడ్డీలో ఉత్తమ ప్రతిభ చాటి ఏకంగా ఆసియా గేమ్స్‌‌ లో ఆడడానికి కబడ్డీ జాతీయ జట్టుకు సెలెక్ట్ అవుతాడు. ఈ మధ్యలో రాణి (అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో భారత జట్టుకు ఎంపికయ్యే క్రమంలో ఊరి నుండి ఢిల్లీ దాకా ఎదురైన కుల, సామాజిక, రాజకీయ ప్రతికూలతను కిట్టన్ ఎలా ఎదుర్కొన్నాడు? మధ్యలో పాండిరాజన్ (అమీర్), కందస్వామి (లాల్) మధ్య వైరం ఏంటి? చివరిగా కిట్టన్ దేశ ప్రతిష్టను ఆసియా క్రీడల్లో చాటాడా లేదా? అనేది సినిమా కథ.

Technical values : మామూలుగానే దర్శకుడు మారి సెల్వరాజ్ తన సినిమాల్లో రెగ్యులర్ గా సమాజంలో జరుగుతున్న అణచివేత, సామాజిక న్యాయం వంటి అంశాలను ఆడియన్స్ కి చెప్తూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా అదే చెప్దామని ట్రై చేసాడు. దానికి కబడ్డీ ఆట నేపథ్యం ఎంచుకున్నాడు. అయితే కబడ్డీ ప్లేయర్ మణాతి గణేశన్ బయోపిక్ అని చెప్పినప్పటికీ ఇది బయోపిక్ లా కాకుండా కమర్షియల్ గా చాలా ఛేంజ్ చేసాడు. ఇక ధృవ్ విక్రమ్ ఈ సినిమాలో తన పాత్ర కోసం బాగా కష్టపడ్డాడు. అనుపమ పరమేశ్వరన్, పశుపతి, లాల్, అమీర్, రజీషా విజయన్ తమ పాత్రలతో మెప్పించారు. 

అయితే వాస్తవాన్ని, ఎమోషన్‌ ను సమపాలలో చూపించే క్రమంలో సినిమా కాస్త సాగదీతగా అనిపిస్తుంది. పైగా ఈ సినిమాలో కథ ప్రకారం కబడ్డీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ సమాజంలో అసమానతలపైనే ఫోకస్ ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది. దాంతో కథలో ఎమోషనల్ ఇంపాక్ట్ మిస్ అయ్యింది. అలాగే మూవీ లెంగ్త్, కూడా ఎక్కువయింది. పైగా వైలెన్స్ ఎక్కువ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ ను మెప్పించదు. నివాస్ కె ప్రసన్న మ్యూజిక్ బాగానే ఉన్నా, కొన్ని చోట్ల సౌండ్ డామినేట్ చేస్తుంది. ఎడిటర్ కొన్ని సీన్లు ట్రిమ్ చేయాల్సింది. 

Final Review : ఓవరాల్‌ గా 'బైసన్' మూవీ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన మూవీ అయినా, సామజిక అణచివేత వంటి అంశాలను ఎక్కువ ప్రస్తావించడంతో మూవీ ఒక వర్గం ఆడియన్స్ కే ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ఉంది. రెగ్యులర్ మూవీ లవర్స్ ఈ సినిమాకు అంతగా కనెక్ట్ అవకపోవచ్చు. సాగదీసే రన్‌టైమ్, వీక్ రైటింగ్ వంటి అంశాలు ఈ చిత్రానికి డ్యామేజ్ చేశాయి. కానీ నటీనటుల పెర్ఫార్మన్స్ కోసం, అలాగే స్పోర్ట్స్ డ్రామా ఇష్టపడే వారు ఒకసారి చూడొచ్చు.

Review Statistics

6.0
Overall Rating
Avg. of all reviews
8
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
6.0/10
Public
N/A