Register as a Reviewer
హ్యాపీ జర్నీ (Happy Journey Teaser)

హ్యాపీ జర్నీ (Happy Journey Teaser)

Upcoming Expected Release: 2026

Happy Journey Teaser : ప్రయాణాన్ని మెమొరీస్ తో కొలిచే హ్యాపీ జర్నీ... త్వరలో ప్రేక్షకుల ముందుకు!

Director: Abhiram Naidu
Cast: Annapurna, Aamani, Jhansi, vamsi, Payal Radhakrishna, Sunaina, Ravi siva teja, Jinisha Alishetty, Roopa Srinivas, Prudhvi Dandamudi and Others

Available in:

About This Movie

టాలీవుడ్ లో ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో లేటెస్ట్ గా "హ్యాపీ జర్నీ" అంటూ ఓ మూవీ రాబోతుంది. అయితే ఈ మూవీలో మొత్తం వేర్వేరు జనరేషన్స్ కి చెందిన ఆర్టిస్ట్ లు నటించడం విశేషం. అభిరాం నాయుడు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ తాజాగా యూట్యూబ్ లో విడుదల చేయగా నెట్టింట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక టీజర్ ని గమనిస్తే... వేర్వేరు జెనరేషన్స్ లకి చెందిన లేడీస్ అంతా కలిసి, ప్యారిస్‌ కు ఒక క్రేజీ ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఆ ట్రిప్ లో వారు చేసే హంగామా, ఎంజోయ్మెంట్స్ వారి మధ్య కుదిరే ఎమోషనల్ బాండింగ్స్, ఇగో క్లాషెస్ అన్ని కలగలిపి ఈ టీజర్ లో కలర్ ఫుల్ గా చూపించారు మేకర్స్.

 

అయితే మెయిన్ లీడ్ గా సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ నటించగా, ఆమని, యాంకర్ ఝాన్సీ హీరోయిన్ పాయ‌ల్ రాధాకృష్ణ‌, రూపా శ్రీనివాస్, జినిషా అలిశెట్టి, సునయన కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఇక మేల్స్ విషయానికి వస్తే... వంశీ, పృథ్వి దండమూడి, రవి శివతేజ నటిస్తున్నారు. అయితే ట్రిప్ జర్నీ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి గాని, మూడు రకాల జెనరేషన్స్ వాళ్ళు నటించిన సినిమాలు రేర్ అని చెప్పాలి. ఇక టెక్నికల్ గా టీజర్ లోనే మంచి సినిమాటోగ్రఫి వర్క్ కనిపిస్తుండడం విశేషం. 

 

అలాగే టీజర్ లో ఆమని, వంశీ, ఘాన్సీ కాంబినేషన్ లో మంచి ఫన్ ట్రాక్ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక అభిరామ్ నాయుడు దర్శకత్వంలో ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ ‘హ్యాపీ జర్నీ’ మూవీని ఫ్లయింగ్ క్యాట్ పిక్చర్స్ బ్యానర్‌ పై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ జులై నెలలో లేదా ఆగష్టు లో హ్యాపీ జర్నీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ట్రై చేస్తున్నారు.

Why MRO?