Register as a Reviewer
ThimmarajuPalli TV (తిమ్మరాజుపల్లి TV)

ThimmarajuPalli TV (తిమ్మరాజుపల్లి TV)

17 Apr 2026

సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ తిమ్మరాజుపల్లి TV. కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని వి.మునిరాజు దర్శకత్వం వహించాడు.

Director: V. Muniraju
Cast: Sai Tej , Vedha Jalandharr , Pradeep Kotte , Swathi Karimireddy , Amma Ramesh, Satyanarayana, Lathish

Available in:

About This Movie

Story : కథ విషయానికి వస్తే.. 90స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో తిమ్మరాజుపల్లి అనే గ్రామంలో ఆవారాగా తిరిగే సతీష్‌ (సాయి తేజ్) అప్పుడప్పుడూ ఊళ్ళో జరిగే ఉత్సవాలకు టివి రెంట్ కి తెచ్చి, సినిమాలు ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాగే  అదే గ్రామానికి చెందిన రాజప్ప (ప్రదీప్ కొట్టే) చెల్లెలైన శారదను (వేదా జలంధర్) సతీష్ ప్రేమిస్తూ ఉంటాడు. అయితే కొన్ని నాటకీయపరిణామాల నేపథ్యంలో ఊళ్ళో రాజప్ప కొత్త టివి కొంటాడు. అయితే అనుకోకుండా ఆ టివి చోరీకి గురైతే ఆ నేరం అందరూ సతీష్ పై నేరం మోపుతారు. దీంతో రెండు వారాల్లో టీవీ దొంగతనం ఎవరు చేసారో బైటపెట్టి నిజం నిరూపించుకుంటానని సతీష్ సవాల్ చేస్తాడు. మరి ఊళ్ళో అవమానాలు సతీష్ ఎలా ఎదుర్కొన్నాడు. ఆ టివి దొంగతనం ఎవరు చేసారో కనిపెట్టడా? శారదతో ప్రేమలో ఉన్న సతీష్ అందులోనూ నెగ్గడా లేదా? అనేది మిగిలిన కథ. 

Technical Values : దాదాపు అంతా కొత్త నటులతో తెరకెక్కించిన ఈ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అదీ 90స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కడం మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. పల్లెటూరు వాతావరణాన్ని చాలా చక్కగా సహజంగా చూపించగా, హీరోగా నటించిన సాయి తేజ్ చక్కగా నటించాడు. అలాగే వేద జలంధర్‌ పాత్రకు ఎక్కువ స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగా నటించింది.
కీలక పాత్రలో నటించిన ప్రదీప్ కూడా బాగా పెర్ఫార్మ్ చేసాడు. అయితే ఈ తిమ్మరాజుపల్లి టీవీ సినిమా కమర్షియల్ మూవీస్ కి భిన్నంగా తెరకెక్కడం వల్ల ఓ వర్గం ఆడియన్స్ కి బాగానే మెప్పించే అవకాశం ఉంది, కానీ కొత్త కథలు కోరుకునే ఆడియన్స్ ని ఎంత వరకు ఆకట్టుకుంటుందో చెప్పలేం. 

ఇక టెక్నికల్ గా చూసుకుంటే... వి.మునిరాజు కథకుడిగా పెద్దగా మెప్పించలేకపోయినా, దర్శకుడుగా పర్లేదనిపించాడు. కాకపోతే కొన్ని  డెప్త్ ఉండాల్సిన సీన్స్ ని పెద్దగా వాడుకోలేదు. పైగా స్క్రీన్ ప్లే కూడా రొటీన్ ఫీల్ ఇచ్చింది. కథలో టివి దొంగతనానికి సంబంధించి సస్పెన్స్ బాగానే క్రియేట్ చేసాడు గాని, హీరో హీరోయిన్ల కథను గాలికొదిలేసినట్టు అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ ని కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేయాల్సింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ పనితనం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్లస్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 

Final Review :

"తిమ్మరాజుపల్లి TV" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ 90స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన డిఫరెంట్ లవ్ కం ఎమోషనల్ డ్రామాగా ఓ వర్గం ఆడియన్స్ కి ఆకట్టుకుంటుంది. కాకపోతే రొటీన్ కథా, కథనాల వల్ల ఆడియన్స్ ని కొంతవరకే ఆకట్టుకోవచ్చు. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే రాసుకోలేకపోవడం వల్ల, చిన్న కథ కావడం వల్ల కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.