Register as a Reviewer
సతీ లీలావతి (Sathi Leelavathi)

సతీ లీలావతి (Sathi Leelavathi)

08 May 2026
Overall Rating
5.0/10
1 Reviews

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "సతీ లీలావతి". లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది.

Director: Tatineni Satya
Cast: Lavanya Tripathi Konidela, Dev Mohan, Naresh, VTV Ganesh, Sapthagiri, Motta Rajendran, Jaffer Sadiq, Tagubothu Ramesh, Joshi and others.

Available in:

Reviews

What critics and the public are saying about సతీ లీలావతి (Sathi Leelavathi)

Media Reviews

1 Avg: 5.0/10
123telugu
123telugu Website
5

Average

Sathi Leelavathi Movie Review

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "సతీ లీలావతి". లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... రొటీన్ కథా కథనాలతో దర్శకుడు తాతినేని సత్య ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. పెర్ఫార్మన్స్ పరంగా లావణ్య త్రిపాఠి వన...

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "సతీ లీలావతి". లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే... రొటీన్ కథా కథనాలతో దర్శకుడు తాతినేని సత్య ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. పెర్ఫార్మన్స్ పరంగా లావణ్య త్రిపాఠి వన్ విమెన్ షోగా నడిపించింది. 


ఓవరాల్‌ గా చూసుకుంటే, ‘సతీ లీలావతి’ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. లావణ్య త్రిపాఠి పెర్ఫార్మెన్స్ మరియు పర్వాలేదనిపించే ఫస్టాఫ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సెకండాఫ్ లో వచ్చే కామెడీ ట్రాక్స్, మెయిన్ ప్లాట్ నుంచి కథ డీవియేట్ కావడం మైనస్. ఈ వీకెండ్ ఏదైనా ఫ్యామిలీ డ్రామా చూడాలనుకునే వారు తక్కువ అంచనాలతో ఈ చిత్రాన్ని చూడటం బెటర్.

May 08, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

ఇక కథ విషయానికి వస్తే... ఓ ఫిల్మ్ డైరెక్టర్ అయిన లీల (లావణ్య త్రిపాఠి) చిన్నప్పట్నుంచి తల్లిదండ్రుల (నరేష్-పవిత్ర లోకేష్)ల మనస్పర్థల గొడవల వల్ల మానసికంగా డిస్ట్రబ్ అవుతుంది. అయితే తన చిన్నప్పటి ఫ్రెండ్ అయిన సైక్రియార్టిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్) ఆమెలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతాడు. ఈ క్రమంలో సేతు నచ్చి అతడ్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లయ్యాక కొన్నాళ్ళకు వాళ్ళ బిజీ షెడ్యూల్స్ వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తుంటాయి. మరి ఆ సమస్యలు వీళ్ళు పరిష్కరించుకున్నారా? మధ్యలో వీళ్ళ లైఫ్ లోకి వచ్చిన నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్) ఎవరు? చివరకు ఈ రామ్ - లీల కలిసారా? విడిపోయారా? అనేది మిగిలిన కథ. 

ఇక సినిమా విషయానికి వస్తే.. ముందుగా మెయిన్ లీడ్ లో "లీల" గా నటించిన లావణ్య త్రిపాఠి గురించి చెప్పాలి. లీల పాత్రలో లావణ్య తన నటనతో మెప్పించింది. చాలా మెచ్యూర్డ్ నటనతో డిఫరెంట్ షేడ్స్ చూపించి ఆకట్టుకోవడమే కాక, వన్ మ్యాన్ షోగా సినిమాని నడిపించింది. అలాగే దేవ్ మోహన్ కూడా తన రోల్ లో చక్కగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మిగతా కీ రోల్స్ చేసిన వాళ్ళు వాళ్ళ పరిధి మేరకు నటించారు. 

అయితే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే... భార్య భర్తల మధ్య వచ్చే గొడవల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కొత్త కథలు కాకపోయినా, ఆడియన్స్ కి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎంగేజ్ చేయగలిగితే అంత బాగా సినిమాలు ఆడేవి. అయితే ఈ మూవీ విషయానికి వస్తే... ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయ్యే సరికే నీరసం వచ్చేస్తుంది. అంత డల్ గా స్టోరీ ఉంది. సెకండ్ హాఫ్ లో కూడా అలాగే ఉంటుంది. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగించేసినట్టు ఉంటుంది. అలాగే సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, విటివి గణేష్ లాంటి కమెడియన్స్ ఉన్నా వారిని సరిగా వాళ్ళని సరిగా వాడుకోలేకపోయారు. ఇక సినిమాలో కొన్ని డైలాగ్స్ ఫ్యామిలీస్ ని ఇబ్బంది పెట్టడం మైనస్.

Technical values : ఇక టెక్నికల్ గా చూస్తే.. దర్శకుడు తాతినేని సత్య ఎదో పాత చింతకాయ పచ్చడి లాంటి కథను తీసుకున్నా... దాన్ని ట్రెండ్ కి తగ్గట్టు ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో విఫలమయ్యారు. కొన్ని సాగదీత సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. 

Final Review :

ఇక మొత్తంగా సతీ లీలావతి ఒక నార్మల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని కొంతవరకు మెప్పించే అవకాశం ఉంది. కానీ ఏమాత్రం కొత్తదనం ఆశించినా ప్రేక్షకులకి కన్నీరే. లావణ్య త్రిపాఠి పెర్ఫార్మన్స్ నచ్చిన వాళ్ళు, అది కూడా తక్కువ అంచనాలతో ఒకసారి ఒకసారి ట్రై చేయొచ్చు.

Review Statistics

5.0
Overall Rating
Avg. of all reviews
1
Total Reviews
From 1 Provider Types

Review Average

Media
5.0/10
Public
N/A
Why MRO?