Register as a Reviewer
Santhana Prapthirasthu (సంతాన ప్రాప్తిరస్తు)

Santhana Prapthirasthu (సంతాన ప్రాప్తిరస్తు)

14 Nov 2025
Overall Rating
5.4/10
8 Reviews

విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా సంజీవ్ రెడ్డి డైరెక్షన్ లో నటించిన మూవీ "సంతాన ప్రాప్తిరస్తు". డిఫరెంట్ బోల్డ్ సబ్జెక్టుతో వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

Director: Sanjeev Reddy
Cast: Chandini Chowdary, Vikranth Reddy, Vennela Kishore, Tharun Bhascker, Abhinav Gomatam

Available in:

Reviews

What critics and the public are saying about Santhana Prapthirasthu (సంతాన ప్రాప్తిరస్తు)

Media Reviews

8 Avg: 5.4/10
Great Andhra
Great Andhra Website
5

Average

Santhana Prapthirasthu movie Review

సంతాన ప్రాప్తిరస్తు అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన విక్రాంత్, చాందిని చౌదరి ఈ మూవీతో మంచి సక్సెస్ కొట్టాలని ఆడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి రేర్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకున్నాడు. దానికి ముందు అతడ్ని అభినందించాలి. సినిమాలో కూడా పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఓవర్ గా లేకుండా చెప్...

సంతాన ప్రాప్తిరస్తు అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన విక్రాంత్, చాందిని చౌదరి ఈ మూవీతో మంచి సక్సెస్ కొట్టాలని ఆడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి రేర్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకున్నాడు. దానికి ముందు అతడ్ని అభినందించాలి. సినిమాలో కూడా పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఓవర్ గా లేకుండా చెప్పాల్సిందాన్ని నీట్ గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. బట్ అందులోనే ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా స్క్రిప్ట్ ని అందించడం లో తడబడ్డాడు. క్లైమాక్స్ ఇంకా ఆసక్తిగా ఉంటె కనెక్ట్ అయ్యేవారు. కానీ సెకండ్ హాఫ్ లో బాగా ల్యాగ్ ఫీల్ వచ్చింది. అయితే నటీనటుల పెర్ఫార్మన్స్ కోసం, ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చూసే ఒక వర్గం ఆడియన్స్ కి సంతాన ప్రాప్తిరస్తు సినిమా నచ్చే అవకాశం ఉంది. బట్ రెగ్యులర్ ఆడియన్స్ అంతగా ఇంప్రెస్ అవకపోవచ్చు.

Nov 14, 2025 Watch
Cinema Picha
Cinema Picha Youtube Channel
5

Average

Santhana Prapthirasthu Movie Review

ప్రెసెంట్ జెనరేషన్ లో యూత్ లో ఉన్న సాధారణ ప్రాబ్లెమ్ సంతాన లేమి, లేదా స్పెర్మ్ కౌంట్ తగ్గుదల. ఇలాంటి సమస్యల్లో ఎక్కువ మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళకి, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్స్ ఈ ప్రాబ్లెమ్ తో సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళని అలర్ట్ చేయడానికి సంతాన ప్రాప్తిరస్తు సినిమా బాగా యూస్ అవుతుంది. ఇక మె...

ప్రెసెంట్ జెనరేషన్ లో యూత్ లో ఉన్న సాధారణ ప్రాబ్లెమ్ సంతాన లేమి, లేదా స్పెర్మ్ కౌంట్ తగ్గుదల. ఇలాంటి సమస్యల్లో ఎక్కువ మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళకి, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్స్ ఈ ప్రాబ్లెమ్ తో సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళని అలర్ట్ చేయడానికి సంతాన ప్రాప్తిరస్తు సినిమా బాగా యూస్ అవుతుంది. ఇక మెయిన్ లీడ్ విక్రాంత్, చాందిని చౌదరి డీసెంట్ పెర్ఫార్మన్స్ తో మెప్పించారు. అండ్ సంజీవ్ రెడ్డి తీసుకున్న స్టోరీ పాయింట్ బాగున్నా, స్క్రీన్ ప్లే పరంగా ల్యాగ్ అయింది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఎంటర్టైనింగ్ గా ఉన్నా కూడా, ల్యాగ్ ఫీల్ వస్తుంది. క్లైమాక్స్ విషయంలో డైరెక్టర్ ఇంకొంచెం ఇంట్రస్టింగ్ గా రాసుంటే ఆడియన్స్ మంచి ఫీల్ తో బయిటికి వచ్చేవారు.

Nov 14, 2025 Watch
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Santhana Prapthirasthu Movie Review

ప్రస్తుత కాలంలో తీసుకునే ఆహారం, పని ఒత్తిడి లాంటి సమస్యలే సంతాన లేమికి కారణం అవుతున్నాయి. దాన్ని ప్రధానాంశంగా తీసుకుని లవ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఇది కాస్త సీరియస్‌ సబ్జెక్టే అయినా ఎక్కడా లిమిట్స్‌ క్రాస్‌ చేయకుండా, ఎవరినీ నొప్పి...

ప్రస్తుత కాలంలో తీసుకునే ఆహారం, పని ఒత్తిడి లాంటి సమస్యలే సంతాన లేమికి కారణం అవుతున్నాయి. దాన్ని ప్రధానాంశంగా తీసుకుని లవ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఇది కాస్త సీరియస్‌ సబ్జెక్టే అయినా ఎక్కడా లిమిట్స్‌ క్రాస్‌ చేయకుండా, ఎవరినీ నొప్పించకుండా లైటర్‌ వేలో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే లవ్‌స్టోరీ పరంగా రొటీన్‌గానే అనిపిస్తుంది. పిల్లల్ని కోరుకోవడం, ఆ తరుణంలో సాగే భావోద్వేగ సన్నివేశాలు, పతాక సన్నివేశం కదిలించేలా ఉన్నాయి. కథ పరంగా మంచిదే అయినా కాస్త ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్‌లతో తీసుంటే ఈ సినిమా జనాల్లోకి బాగా వెళ్లేది. సినిమాలో నటీనటులు బాగానే పెర్ఫార్మ్ చేసినా, బలమైన పెద్ద ఆర్టిస్టులతో సినిమాని తీసుంటే, అప్పుడు ప్రమోషన్‌ బలంగా చేస్తే జనాలకు చేరువయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఒకసారి చూసేలా అయితే ఉంది.

Feb 05, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

Santhana Prapthirasthu movie Review

సంతాన వైఫల్యం, అంగస్థంభన లాంటి అంశాలను పాయింట్లుగా చేసుకొని రూపొందించిన యూత్‌ఫుల్, కామెడీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ సంతాన ప్రాప్తిరస్తు. తండ్రి కూతురు మధ్య డ్రామా, క్యూట్ లవ్ స్టోరి, ఆర్గానిక్ కామెడీ అంశాలు ఈ సినిమాకు ప్లస్‌గా మారాయి. విక్రాంత్, చాందిని చౌదరి తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇక కథలో మురళీధర్...

సంతాన వైఫల్యం, అంగస్థంభన లాంటి అంశాలను పాయింట్లుగా చేసుకొని రూపొందించిన యూత్‌ఫుల్, కామెడీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ సంతాన ప్రాప్తిరస్తు. తండ్రి కూతురు మధ్య డ్రామా, క్యూట్ లవ్ స్టోరి, ఆర్గానిక్ కామెడీ అంశాలు ఈ సినిమాకు ప్లస్‌గా మారాయి. విక్రాంత్, చాందిని చౌదరి తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇక కథలో మురళీధర్ గౌడ్ ట్రాక్ చాలా రొటీన్ గా, రెగ్యులర్‌గా ఉంటుంది. ఇక వెన్నెల కిషోర్, అభినవ్, తరుణ్ భాస్కర్‌ కామెడీ హాయిగా నవ్వుకొనేలా ఉంటుంది. ఓవరాల్ గా కాన్సెప్ట్ పరంగా మెప్పిస్తుంది కానీ, రెగ్యులర్ మూవీ లవర్స్ ని కమర్షియల్ గా ఆకట్టుకోదు. కొత్త కాన్సెప్ట్ ఆశించే ఆడియన్స్ కి ఓ మోస్తరు కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ గా పెద్దగా అంచనాలు లేకుండా వెళ్తే రెండు గంటలపాటు హాయిగా నవ్వుకొని వచ్చేలా డీసెంట్ గా సంతాన ప్రాప్తిరస్తు ఉంటుంది.

Nov 14, 2025 Read Review
T
Telugu360.com Website
5

Average

Santhana Prapthirasthu movie Review

చిన్న చిన్న కాన్సెప్టుల‌తో సినిమాలు చేయ‌డం అంత ఈజీ ఏం కాదు. క‌థ‌నంలో ద‌మ్ముండాలి. క్యారెక్ట‌రైజేష‌న్లు కొత్త‌గా ఉండాలి. అప్పుడే కాన్సెప్టులు క‌థ‌ల‌వుతాయి. క‌థ‌లు సినిమాలుగా మార‌తాయి. ‘సంతాప ప్రాప్తిర‌స్తు’ కూడా కాన్సెప్టుని న‌మ్ముకొన్న క‌థే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా సున్నిత‌మైన‌ది. దాన్ని ఎక్...

చిన్న చిన్న కాన్సెప్టుల‌తో సినిమాలు చేయ‌డం అంత ఈజీ ఏం కాదు. క‌థ‌నంలో ద‌మ్ముండాలి. క్యారెక్ట‌రైజేష‌న్లు కొత్త‌గా ఉండాలి. అప్పుడే కాన్సెప్టులు క‌థ‌ల‌వుతాయి. క‌థ‌లు సినిమాలుగా మార‌తాయి. ‘సంతాప ప్రాప్తిర‌స్తు’ కూడా కాన్సెప్టుని న‌మ్ముకొన్న క‌థే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా సున్నిత‌మైన‌ది. దాన్ని ఎక్క‌డా అస‌భ్య‌త లేకుండా చూపించ‌గలిగాడు ద‌ర్శ‌కుడు. ఈ విష‌యంలో మాత్రం మెచ్చుకోవాల్సిందే. రైటింగ్ ప‌రంగా ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండాల్సింది. ముఖ్యంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీన్లపై బాగా క‌స‌ర‌త్తు చేయాల్సింది. విక్కీ డోన‌ర్ సినిమా వ‌చ్చి పుష్క‌రం దాటింది. ఇలాంట‌ప్పుడు మ‌ళ్లీ అలాంటి క‌థ‌తో ఓ సినిమా చేస్తున్నామంటే.. క‌థ‌నంలో, పాత్ర‌ల చిత్ర‌ణ‌లో వైవిధ్యం చూపించాల్సిందే. ఈ విష‌యంలో ‘సంతాన ప్రాప్తిర‌స్తు’ కాస్త వెన‌క‌బ‌డింది. అయితే విక్రాంత్, చాందిని సహా ఇతర నటీనటులు తమ వంతు న్యాయం చేసారు. ఓవరాల్ గా అక్క‌డ‌క్క‌డ కొన్ని నవ్వుల కోసం, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు త‌మ‌పై తాము వేసుకొనే సెటైర్ల కోసమైతే ఈ సినిమా చూడొచ్చు.

Nov 14, 2025 Read Review
6

Above Average

Santhana Prapthirasthu movie Review

సంతానలేమి అనేది సెన్సిబుల్‌ సబ్జెక్ట్. ఇదే కాన్సెప్ట్ కి కొంత ఫన్‌, ఎమోషన్స్ ని జోడించి సంతాన ప్రాప్తిరస్తు మూవీని రూపొందించారు దర్శకుడు సంజీవ్‌ రెడ్డి. కాంటెంపరరీ అంశాలను ఇందులో బాగా చూపించారు. అయితే డైరెక్టర్ ఈ టాపిక్ ని నీట్ గా ప్రెజెంట్ చేసాడు గాని, ఆడియన్స్ కి కాన్సెప్ట్ బోర్ కొట్టేసింది. ఇంట్ర...

సంతానలేమి అనేది సెన్సిబుల్‌ సబ్జెక్ట్. ఇదే కాన్సెప్ట్ కి కొంత ఫన్‌, ఎమోషన్స్ ని జోడించి సంతాన ప్రాప్తిరస్తు మూవీని రూపొందించారు దర్శకుడు సంజీవ్‌ రెడ్డి. కాంటెంపరరీ అంశాలను ఇందులో బాగా చూపించారు. అయితే డైరెక్టర్ ఈ టాపిక్ ని నీట్ గా ప్రెజెంట్ చేసాడు గాని, ఆడియన్స్ కి కాన్సెప్ట్ బోర్ కొట్టేసింది. ఇంట్రెస్టింగ్ గా సెకండ్ హాఫ్ లేకపోవడం, బోరింగ్ క్లైమాక్స్ వల్ల కొంతవరకు ఆడియన్స్ డిస్సపాయింట్ అవుతారు. టెక్నికల్ గా సినిమాకి సునీల్‌ కశ్యప్‌ మ్యూజిక్‌ ప్లస్‌గా చెప్పొచ్చు. మహిరెడ్డి పండుగుల కెమెరా వర్క్ కలర్‌ఫుల్‌ గా ఉంది. ఆర్ట్ వర్క్ సైతం ఆకట్టుకుంది. సాయికృష్ణ గనల ఎడిటింగ్‌ కొంత ట్రిమ్‌ చేయోచ్చు. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ రిచ్‌గా ఉన్నాయి. దర్శకుడు సంజీవ్‌ రెడ్డి ఎంచుకున్న కథ బాగుంది. కానీ ఆశించిన స్థాయిలో సినిమాలో ఫన్‌ వర్కౌట్‌ కాలేదు. ఎమోషన్స్ వరకు వర్కౌట్‌ అయ్యాయి, కానీ ఇంకా బాగా చెప్పాల్సింది. కాకపోతే లవ్‌ స్టోరీలో ఎమోషన్‌ ని, తండ్రికూతుళ్ల మధ్య అనుబంధాన్ని మరింత బలంగా చూపిస్తే బాగుండేది.

Nov 14, 2025 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
5

Average

Santhana Prapthirasthu Movie Review

పెళ్లి చేసుకున్నామా? పిల్లల్ని కన్నామా? అన్నదే కాకుండా.. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాన్ని కళ్లకి కట్టారు. చూడ్డానికి ఫన్‌గానే అనిపించినా కూడా.. తేడా కొడితే స్పెర్మ్ కౌంట్ కొట్టేస్తాది జాగ్రత్త అని అలర్ట్ చేసిన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌...

పెళ్లి చేసుకున్నామా? పిల్లల్ని కన్నామా? అన్నదే కాకుండా.. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాన్ని కళ్లకి కట్టారు. చూడ్డానికి ఫన్‌గానే అనిపించినా కూడా.. తేడా కొడితే స్పెర్మ్ కౌంట్ కొట్టేస్తాది జాగ్రత్త అని అలర్ట్ చేసిన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా విక్రాంత్ బాగానే సెట్ అయ్యాడు. తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి.. తనకి ఏ పాత్ర ఇచ్చినా కూడా బాగా ఓన్ చేసుకుంటుంది. అటు తండ్రికి ఇటు భర్తకి మధ్య నలిగిపోయే పాత్రలో మెప్పించింది చాందినీ చౌదరి. అయితే స్క్రీన్ ప్లే పరంగా బాగా స్లో అయింది. సాంకేతికంగా.. భారీ ఆర్భాటాలు లేకుండా కథకి తగ్గట్టుగానే మ్యూజిక్, కెమెరావర్క్, మిగిలిన సెటప్‌ అంటా బాగా కుదిరింది. మహిరెడ్డి పండుగల కెమెరా వర్క్, మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా.. సంతాన సమస్యతో బాధపడే యువ జంటలు ఈ కథకి కనెక్ట్ అవ్వొచ్చు.

Nov 14, 2025 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Santhana Prapthirasthu Movie Review

విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన డిఫరెంట్ బోల్డ్ సబ్జెక్ట్ "సంతాన ప్రాప్తిరస్తు". సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ఓవరాల్ గా సినిమా కంటెంట్ బాగున్నా, దాన్ని ఆడియన్స్ కి పూర్తి స్థాయిలో ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో తడబడ్డారు. సింపుల్ గా ‘సంతాన ప్రాప...

విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన డిఫరెంట్ బోల్డ్ సబ్జెక్ట్ "సంతాన ప్రాప్తిరస్తు". సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ఓవరాల్ గా సినిమా కంటెంట్ బాగున్నా, దాన్ని ఆడియన్స్ కి పూర్తి స్థాయిలో ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో తడబడ్డారు. సింపుల్ గా ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఒక సున్నితమైన సబ్జెక్టుతో సాగే డీసెంట్ కామెడీ డ్రామా అని చెప్పవచ్చు. అలాగే సినిమాలో పాత్రలు వాటి చుట్టూ అల్లుకున్న కామెడీ కథనం ఈ చిత్రంలో ఎంగేజ్ చేస్తాయి. అలాగే విక్రాంత్, చాందిని ఇంకా మురళీధర్ గౌడ్ లు తమ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకున్నారు. అయితే ఎమోషనల్ పార్ట్ పై ఇంకొంచెం దృష్టి పెట్టుంటే ఈ సినిమా ఇంకా బెటర్ ఫీల్ కలిగించేది. దీంతో పాటు కొన్ని చోట్ల స్లో మూమెంట్స్ పక్కన పెడితే ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ కోరుకునే ఆడియన్స్ కి మెప్పిస్తుంది.

Nov 14, 2025 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన చైతన్య (విక్రాంత్) ఒక అనాథ. తనకంటూ ఒక ఫ్యామిలీ కావాలని పెళ్లి చేసుకోవాలని కలలు గంటూ ఉంటాడు. కానీ అతను ఇంట్రోవర్ట్ కావడంతో అమ్మాయిలతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో కళ్యాణి (చాందిని చౌదరి) పరిచయం అవుతుంది. వారి పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే వరకు వెళుతుంది, కానీ పెళ్లి తర్వాత చైతన్యకి వీర్యకణాల సంఖ్య తక్కువ ఉంది అని తెలుస్తుంది. ఇదే సమయం నుండి కళ్యాణి తండ్రి కూడా వీళ్ళని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఇలాంటి సమస్యల నుంచి ఈ వీళ్ళు ఎలా కలిసి అధిగమించారు. వీళ్ళకి పిల్లలు పుట్టారా లేదా? చైతన్య, కళ్యాణి ఫైనల్ గా కలుస్తారా లేదా అనేది కథ. 

Technical values : కథ నేపథ్యం విషయానికి వస్తే... చాలా సింపుల్ స్టోరీ. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలొచ్చాయి. అయితే డైరెక్టర్ ఎంచుకున్న కాన్సెప్ట్ కూడా ప్రస్తుతం చాలా మందికి ఉన్న సమస్యే కాబట్టి, యూత్ ఈ సబ్జెక్టు కి బాగా కనెక్ట్ అవుతారు. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. నటీనటులు విక్రాంత్, చాందిని చౌదరితో పాటు మురళీధర్ గౌడ్ పాత్ర కూడా మెప్పిస్తుంది. అయితే స్క్రీన్ ప్లే పరంగా సంజీవ్ రెడ్డి తడబడ్డాడు. ఆడియన్స్ కి ఇంటర్వెల్ టైముకి కాన్సెప్ట్ మొత్తం తెలుస్తుంది కాబట్టి తర్వాత సీన్లను ఈజీగా గెస్ చేయగలరు. సో కథనంలో కొత్తదనం లేకుండా పోయింది. క్లైమాక్స్ కూడా తేలిపోయినట్టుంది. 

ఇక టెక్నికల్ గా సినిమా నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. సునీల్ కశ్యప్ మ్యూజిక్ బీజీఎమ్ పర్లేదు. ఎడిటర్ అనవసరమైన సీన్లను సెకండాఫ్ లో కొన్నింటిని ట్రిమ్ చేయాల్సింది. అలాగే సినిమా నేపథ్యం బాగున్నా, దాన్ని ఆడియన్స్ కి నచ్చే విధంగా ఎంటర్టైనింగ్ గా చూపించి ఉంటే బాగుండేది.

Final Review : ఓవరాల్ గా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా యూత్ కి సాఫ్ట్వేర్ జాబర్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. కాకపోతే బోల్డ్ సబ్జెక్టు కావడంతో ఫ్యామిలీస్ కనెక్ట్ కావడం కష్టం. అయితే కొత్త కాన్సెప్ట్ కోరుకునే ఆడియన్స్ కి ఈ సినిమా కాస్త కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

Review Statistics

5.4
Overall Rating
Avg. of all reviews
8
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
5.4/10
Public
N/A