Ramayana (రామాయణ)
Ramayana : గ్రాండియర్ గా "రామాయణ" టీజర్... ఈ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు...
Available in:
About This Movie
బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "రామాయణ" చిత్రం కోసం పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 2000 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "రామాయణ" చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉండగా, ఆ మధ్య వచ్చిన షార్ట్ గ్లింప్స్ తోనే సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా హనుమాన్ జన్మదినోత్సవం కానుకగా "రామాయణ" టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేయగా, ఆ వీడియో కి అద్భుతమైన స్పందన వస్తుంది.
అయితే రామాయణ టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం విజువల్స్, బీజీఎమ్ తో ఇంప్రెస్ చేసారు మేకర్స్. ఇక శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ వ్యూయర్స్ ని కట్టిపడేస్తోంది. లుక్స్ పరంగా దశరథ రాముడిగా ప్రశాంతంగా కనిపిస్తూనే, విల్లు చేతబట్టిన శ్రీరాముడి గా కనబరిచే గాంభీర్యత కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక రామాయణ లో సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా మరియు రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. వీడియో చివరలో పుష్పక విమానం ఎక్కుతున్న రావణుడిగా యశ్ ని చూపించిన షాట్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది.
టెక్నికల్ గా హన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బీజీఎమ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అలాగే VFX టెక్నాలజీ టీం కూడా బెస్ట్ వర్క్ఇచ్చారు . ఐమ్యాక్స్ మరియు డాల్బీ సినిమా ఫార్మాట్లలో ఈ సినిమా విడుదల కానుండగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాను నితీష్ తివారి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక రామాయణ సినిమా ఫస్ట్ పార్ట్ 2026 దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుండగా, రెండో భాగం వచ్చే ఏడాది (2027) దీపావళి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.