Register as a Reviewer
Peddi (పెద్ది)

Peddi (పెద్ది)

Upcoming Expected Release: 30 Apr 2026

Peddi Pehelwan Glimpse Talk : 'పెద్ది' అంటే బ్యాట్ తో బంతికెదురెళ్ళే వాడే కాదు... అంతకు మించి.. త్వరలో ఆడియన్స్ ముందుకు...

Director: Buchibabu
Cast: Ramcharan,JanhviKapoor, Shivarajkumar,Jagapathibabu,Divyendusharma

Available in:

About This Movie

ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు ఎదురుచూస్తున్న "పెద్ది" రెండో గ్లింప్స్ నెట్టింట వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతుంది. శ్రీరామ నవమి శుభాకాంక్షలతో విడుదలైన ఈ వీడియోను డైరెక్టర్ అదిరిపోయే షాట్స్ తో కట్ చేసారు. పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా ఈ ఇయర్ రిలీజ్ అవుతున్న అతి పెద్ద క్రేజీ సినిమాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. 

 

ఇక గ్లింప్స్ ని గమనిస్తే సినిమాలో ఇప్పటివరకు రామ్ చరణ్ క్రికెట్ ఆట ఆడుతాడని అందరూ అనుకున్నారు. కానీ, అంతకు మించి పెద్ది ఉండబోతుందని మేకర్స్ చెప్తున్నారు. విడుదలైన గ్లింప్స్‌ లో రామ్ చరణ్ కండలు తిరిగిన కుస్తీ పెహల్వాన్‌గా కనిపించాడు. ఫెరోషియస్ లుక్‌ తో చేతిలో గద పట్టుకుని ఉన్న తీరు ఫ్యాన్స్ కి గూస్బంప్స్ వచ్చేలా చేస్తుంది. రామ్ చరణ్‌ ను పూర్తిగా కుస్తీ పెహల్వాన్ అవతార్ లో డైరెక్టర్ బుచ్చిబాబు ప్రెజెంట్ చేసారు. 


ఇక గ్లింప్స్ లో వచ్చే డైలాగ్ "కుస్తీ అంటే బంతి తో బ్యాట్‌కు ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో సావుకు ఎదురెళ్లే ఆట.. ఇప్పుడు సెప్పు.. ఉంటావా పోతావా.." అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే డైలాగ్, దానికితోడు  "సూడబ్బి.. ఆటే నా పొగరు.." అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్, దానికి తోడు టీజర్ లో వచ్చే ఎలివేషన్ షాట్స్ సాలిడ్ గా ఉన్నాయి. ఇక పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేన్దు శర్మ కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.