కర (Kara)
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "కర". విగ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ మూవీలో మామితా బైజు హీరోయిన్ గా నటించింది. జివి ప్రకాష్ సంగీతం అందించాడు.
Available in:
About This Movie
కరసామి (ధనుష్) ఒక దొంగ. ఏం చదువుకోలేక, ఊళ్ళో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. కానీ దొంగతనాలు మానేసి సెటిల్ అవుదామని, చివరిగా ఒక పెద్ద దొంగతనం చేద్దామని ప్రయత్నించి దొరికిపోతాడు. అయితే కరసామి పోలీసుల నుండి తప్పించుకుని దొంగతనాలు మానేసి, తాను ప్రేమించిన మల్లి (మమిత బైజు)ని పెళ్లి చేసుకుని లైఫ్ ని లీడ్ చేస్తుంటాడు. అయినా పేదరికం వల్ల పలు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కరసామి తండ్రి కందసామి (కెఎస్ రవికుమార్) మరణిస్తాడు. అయితే వీళ్ళ ఫ్యామిలీకి బ్యాంకులో ఉన్న లోను కారణంగా, చనిపోయిన తన తండ్రి శవాన్ని కరసామి పొలంలో పాతిపెట్టడానికి బ్యాంకు ఒప్పుకోదు. ఈ క్రమంలో కరసామి తమని ఇబ్బంది పెట్టిన బ్యాంకుల్లో దొంగతనాలు చేస్తాడు. మరి తమని, ఊరు వాళ్ళని బ్యాంక్ మేనేజర్ ముత్తు సెల్వన్ (జయరాం) చేస్తున్న మోసాన్ని కర ఎలా తిప్పి కొడతాడు? చివరకు కర తన తండ్రి చివరి కోరికను తీర్చాడా? దొంగతనం చేసిన బ్యాంకు డబ్బును ఏం చేసాడు అన్నదే మిగిలిన కథ.
90స్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఈ కథ నేపథ్యంలో సొసైటీలో పెద్ద మనుషుల మీద యువకుడు చేసిన పోరాటాన్ని, అతడి ఆవేదనను చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. అలాగే ధనుష్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తన రోల్ లో సెటిల్డ్ గా కనిపిస్తూ, పాత్రకు తగ్గ వేరియేషన్స్ చూపించాడు. ఇటు మమిత బైజు కూడా తన రోల్ లో ఇంప్రెస్ చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అలాగే దర్శకుడు విఘ్నేష్ రాజా రాసుకున్న మెయిన్ థీమ్ సినిమాకు మంచి ప్లస్ అయింది.
అయితే సినిమాలో కథ నేపథ్యాన్ని బలంగా రాసుకోలేదు దర్శకుడు. సినిమాలో ఎక్కువగా ఫాదర్ సెంటిమెంట్ చుట్టే తిరుగుతుంది, గాని కథలో భాగంగా అవసరమైన స్క్రీన్ ప్లే గాని, సీన్లు గాని లేవు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ల్యాగ్ ఎక్కువైంది. అలాగే లవ్ ట్రాక్ కూడా అంతగా పండలేదు.
Technical values :
ఇక టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే... దర్శకుడు విఘ్నేష్ రాజా కథ పాయింట్ బాగానే రాసుకున్నా, దానికి తగ్గ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. యాక్షన్, సెంటిమెంట్ సీన్లు అన్నీ బాగానే ఉన్నా కొత్తదనం మాత్రం కనిపించలేదు. ఇక జివి ప్రకాష్ అందించిన మ్యూజిక్ పర్లేదు, బీజీఎమ్ పై ఇంకా ఫోకస్ పెట్టాల్సింది.
సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక ఎడిటింగ్ వర్క్ కూడా బాగా చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
Final Review :
ఓవరాల్ గా ధనుష్ నుండి వచ్చిన "కర" మూవీ ఒక డీసెంట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఓ వర్గం ఆడియన్స్ ని మెప్పిస్తుంది. అలాగే విలేజ్ నేటివిటీ కోరుకునే ఆడియన్స్ ని కూడా కొంతవరకు మెప్పిస్తుంది. అయితే కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ఈ సినిమాకు దూరం కావచ్చు. ధనుష్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ తక్కువ అంచనాలతో ఈ మూవీని ఓసారి చూసేయొచ్చు.