Register as a Reviewer
K - Ramp (కే- ర్యాంప్)

K - Ramp (కే- ర్యాంప్)

18 Oct 2025
Overall Rating
6.0/10
8 Reviews

టాలెంటెడ్ హీరో "కిరణ్ అబ్బవరం" హీరోగా నటించిన మూవీ 'కే - ర్యాంప్'. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.

Director: Jains Nani
Cast: Kiran Abbavaram, Yukti Thareja, Sai Kumar, Naresh, Vennela Kishore

Available in:

Reviews

What critics and the public are saying about K - Ramp (కే- ర్యాంప్)

Media Reviews

8 Avg: 6.0/10
Chitra Jyothy
Chitra Jyothy Website
6

Above Average

K - Ramp Movie Review

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐదేళ్లలోనే పది చిత్రాలు పూర్తి చేశాడు. తన కథల ఎంపిక బాగా ఉన్నా ఏదో కలిసి రావడం లేదు. గతేడాది ‘క’ తో సూపర్ హిట్ అందుకున్న, ఇప్పుడు ‘కె-ర్యాంప్’ అంటూ వచ్చాడు. యుక్తి తరేజా (Yukti...

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐదేళ్లలోనే పది చిత్రాలు పూర్తి చేశాడు. తన కథల ఎంపిక బాగా ఉన్నా ఏదో కలిసి రావడం లేదు. గతేడాది ‘క’ తో సూపర్ హిట్ అందుకున్న, ఇప్పుడు ‘కె-ర్యాంప్’ అంటూ వచ్చాడు. యుక్తి తరేజా (Yukti Tareja)కథానాయికగా జైన్స్ నాని (Jains Nani) దర్శకత్వంలో రాజేష్ దండా-శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం తాజాగా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది


మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ రొటీన్ లవ్ స్టోరీ ని దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంది. ఇక వినోదాన్ని, భావోద్వేగాలను మేళవిస్తూ సినిమా జైన్స్ నాని సినిమా తీసిన విధానం అందరినీ అలరిస్తుందనే చెప్పవచ్చు. నిజానికి ఇది తనకు మంచి పరిచయ చిత్రం అవుతుంది. లోపాలు, లాజిక్కులు వెతక్కుండా ఓసారి ఈ సినిమా చూసేయవచ్చు.

Oct 18, 2025 Read Review
Thyview
Thyview Youtube Channel
6

Above Average

K - Ramp Movie Review

కిరణ్ అబ్బవరం నటించిన “కే–రాంప్” సినిమా ఒక లైన్‌లో చెప్పాలంటే – ఐడియా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. సినిమా మొదలైనప్పటి నుంచి డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమవుతుంది, కానీ దాన్ని స్క్రీన్ మీద బలంగా చూపించడంలో తడబడినట్టు అనిపిస్తుంది. కథ కొత్తదేమీ కాదు, మనం ఇంతకుముందే చాలా సినిమాల్లో చూస...

కిరణ్ అబ్బవరం నటించిన “కే–రాంప్” సినిమా ఒక లైన్‌లో చెప్పాలంటే – ఐడియా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. సినిమా మొదలైనప్పటి నుంచి డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థమవుతుంది, కానీ దాన్ని స్క్రీన్ మీద బలంగా చూపించడంలో తడబడినట్టు అనిపిస్తుంది. కథ కొత్తదేమీ కాదు, మనం ఇంతకుముందే చాలా సినిమాల్లో చూసిన ఫార్ములానే. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్‌గా ఉన్నా, సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్క్రీన్‌ప్లే పూర్తిగా డౌన్ అయిపోతుంది. కిరణ్ అబ్బవరం పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, తన స్టైల్‌లోనే చేశాడు. కొన్ని సీన్స్‌లో ఎమోషన్ వర్క్ అవుతుంది, కానీ చాలా చోట్ల ఓవర్ ఇంటెన్స్‌గా అనిపిస్తుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మ్యూజిక్ పెద్దగా గుర్తుండిపోయేది కాదు, బీజీఎం కూడా సీన్స్‌ని ఎలివేట్ చేయలేకపోయింది. మొత్తానికి “కే–రాంప్” ఒక యావరేజ్ సినిమా.

Oct 18, 2025 Watch
Ragadi
Ragadi Youtube Channel
6

Above Average

K - Ramp movie Review

కిరణ్ అబ్బవరం నటించిన “కే–రాంప్” సినిమా అంటే ముందే ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కానీ సినిమా స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకే క్లారిటీ వచ్చేస్తుంది – ఇది పూర్తిగా మాస్‌కు మాత్రమే కనెక్ట్ అయ్యే ప్రయత్నం. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ విషయానికి వస్తే, తన పాత సినిమాల్లో చూసిన అదే ఎనర్జీ, అదే బాడీ లాంగ్వేజ్...

కిరణ్ అబ్బవరం నటించిన “కే–రాంప్” సినిమా అంటే ముందే ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కానీ సినిమా స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకే క్లారిటీ వచ్చేస్తుంది – ఇది పూర్తిగా మాస్‌కు మాత్రమే కనెక్ట్ అయ్యే ప్రయత్నం. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ విషయానికి వస్తే, తన పాత సినిమాల్లో చూసిన అదే ఎనర్జీ, అదే బాడీ లాంగ్వేజ్. కొన్ని సీన్స్‌లో బాగానే సెట్ అయ్యాడు కానీ కొత్తదనం మాత్రం మిస్ అయింది. కథ చాలా సింపుల్, ప్రెడిక్టబుల్‌గా నడుస్తుంది. స్క్రీన్‌ప్లే ఇంకాస్త టైట్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. డైరెక్షన్ పరంగా చెప్పాలంటే, కొన్ని సీన్స్ ఎలివేషన్ బాగా వర్క్ అయ్యాయి కానీ మధ్యలో లాగ్ ఫీల్ ఎక్కువ. విలన్ క్యారెక్టర్‌కు సరైన డెప్త్ లేకపోవడం మైనస్. పాటలు ఓకే అనిపిస్తాయి కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. మొత్తానికి “కే–రాంప్” సినిమా కిరణ్ అబ్బవరం అభిమానులకు ఒకసారి చూసేలా ఉంటుంది, కానీ జనరల్ ఆడియన్స్‌కు మాత్రం పెద్దగా ఇంప్రెస్ చేయదు. థియేటర్‌కి వెళ్లాలా వద్దా అనేది మీ అంచనాల మీదే ఆధారపడి ఉంటుంది.

Oct 18, 2025 Watch
F
FilmyFocus Website
6

Above Average

K - Ramp Movie Review

కిరణ్ అబ్బవరం నటించిన కె - ర్యాంప్ మూవీ ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా చూడండి అని చెప్పడంలో తప్పు లేదు, కానీ.. ఆ ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ గా ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. “K-ర్యాంప్” సినిమా కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. కిరణ్ అబ్బవరం టైమింగ్, మాస్ ఫైట్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్త...

కిరణ్ అబ్బవరం నటించిన కె - ర్యాంప్ మూవీ ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా చూడండి అని చెప్పడంలో తప్పు లేదు, కానీ.. ఆ ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ గా ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. “K-ర్యాంప్” సినిమా కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. కిరణ్ అబ్బవరం టైమింగ్, మాస్ ఫైట్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్తాయి. అయితే.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను డీల్ చేసిన విధానం కానీ, దానికి సమాధానం చెప్పిన విధానం కన్విన్సింగ్ గా లేదు. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అలాగే.. ఇబ్బందిపట్టే హాస్యం కూడా ఉంది. ఇక యుక్తి తరేజా, సాయికుమార్, మురళీధర్ గౌడ్ వాళ్ళ పరిధి మేరకు బాగా నటించారు. టెక్నికల్ గా మూవీ టీం ఎఫర్ట్స్ కూడా బాగున్నాయి. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ బాగుంది. ఓవరాల్ గా ఎక్కువ ఎక్స్పెక్ట్ పెట్టుకోకుండా మూవీ చూస్తే బెటర్. కథలో కొత్తదనం మాత్రం ఉండదు.

Oct 18, 2025 Read Review
I
Idream Post Website
6

Above Average

K - Ramp movie Review

కే - ర్యాంప్ మూవీ కథ విషయానికి వస్తే.. కథలో కొత్తదనం ఉందని అనిపించదు కానీ.. కథనంలో మాత్రం కొత్తదనం ఉంది. లాజిక్స్ వెతకకుండా ఓ లవ్ స్టోరీ చూసి నవ్వుకోవాలి అంటే ఈ సినిమా బెటర్ చాయిస్. పైగా లాజిక్స్ వెతకొద్దని సినిమా టీం ముందే అనౌన్స్ చేసేసింది. డైరెక్టర్ కూడా దానికి తగినట్టుగానే కథ రాసుకున్నాడు. అయితే...

కే - ర్యాంప్ మూవీ కథ విషయానికి వస్తే.. కథలో కొత్తదనం ఉందని అనిపించదు కానీ.. కథనంలో మాత్రం కొత్తదనం ఉంది. లాజిక్స్ వెతకకుండా ఓ లవ్ స్టోరీ చూసి నవ్వుకోవాలి అంటే ఈ సినిమా బెటర్ చాయిస్. పైగా లాజిక్స్ వెతకొద్దని సినిమా టీం ముందే అనౌన్స్ చేసేసింది. డైరెక్టర్ కూడా దానికి తగినట్టుగానే కథ రాసుకున్నాడు. అయితే మరీ డీప్ గా వెళ్లకుండా ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, దీని చుట్టూ కొన్ని కామెడి లేయర్స్ రాసుకున్నాడు దర్శకుడు. వన్ లైనర్స్ కూడా బాగానే ఉన్నాయి. కిరణ్ అబ్బవరం స్టైల్ లు కరెక్ట్ గా సూట్ అయ్యాయి. మూవీ స్టార్ట్ అయిన మొదటి 15నిముషాల తర్వాత కథ కాలేజ్ కు షిఫ్ట్ అవుతుంది. తర్వాత అంతా ప్రెడిక్టబిల్ గానే ఉంటుంది. హీరో హీరోయిన్ తో ప్రేమలో పడడం. ఆమెను పడేయడం కోసం తిప్పలు పడడం. ఆ తర్వాత హీరోయిన్ కు ఉన్న సమస్య బయటపడడం.. దాని కోసం హీరో పడే పాట్లు , టెన్షన్స్ ఇవన్నీ ఫన్నీ వే లోనే చూపించారు. అలా మొదటి హాఫ్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఆఫ్ లో కథ కొంచెం సీరియస్ గా సాగి హీరో తన తండ్రి గురించి తెలుసుకోవడం.. లాంటివి జరుగుతాయి. ఓవరాల్ గా నవ్వుకోవడానికి కే - ర్యాంప్ మంచి ఛాయస్.

Oct 18, 2025 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

K - Ramp Movie Review

కిరణ్ అబ్బవరం నటించిన కే - ర్యాంప్ మూవీ ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయింది. దర్శకుడు జైన్స్ నాని స్టోరీ పరంగా మెప్పించలేదు గాని, ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా సినిమా కంటెంట్ విషయానికి వస్తే..ఈ మూవీ కేవలం కామెడీ చిత్రం మాత్రమే కాదు.. యూత్‌కు నచ్చే లవ్ స్టోరి. ఫ్యామిలీ ఆడియెన...

కిరణ్ అబ్బవరం నటించిన కే - ర్యాంప్ మూవీ ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయింది. దర్శకుడు జైన్స్ నాని స్టోరీ పరంగా మెప్పించలేదు గాని, ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా సినిమా కంటెంట్ విషయానికి వస్తే..ఈ మూవీ కేవలం కామెడీ చిత్రం మాత్రమే కాదు.. యూత్‌కు నచ్చే లవ్ స్టోరి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే ఫాదర్ సెంటిమెంట్ ఈ కథలో భాగమయ్యాయి. కిరణ్ అబ్బవరం హృదయాన్ని భారంగా మార్చే నటనను ప్రదర్శించాడు. దీపావళీ పండుగ సీజన్‌లో కుటంబ సమేతంగా చూసే చిత్రమే కాకుండా మంచి వినోదాన్ని ఆస్వాదించేలా మూవీని రూపొందించారు. ఈ పండుగ సెలవుల్లో ఈ సినిమాను మీ లిస్టులో ఎలాంటి సందేహాలు లేకుండా చేర్చుకోవచ్చు. మీరు పెట్టే టికెట్‌కు ఫుల్ పైసా వసూల్ మూవీ ఈ కె ర్యాంప్. కాకపోతే కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయకుండా మూవీ చుస్తే బెటర్.

Oct 18, 2025 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
6

Above Average

K - Ramp movie Review

కే ర్యాంప్.. కిరణ్ అబ్బవరం ర్యాంప్‌నో.. కుమార్ ర్యాంప్‌నో.. లేదంటే కు** ర్యాంప్‌నో.. ర్యాంప్‌కి ముందు తోక ఏదైనా కావచ్చు కానీ.. ముందు మాత్రం ఆడియన్స్‌కి కావాల్సింది ఎంటర్‌టైన్మెంట్. అదే పాయింట్‌తో మీకు హామీ ఇస్తున్నా.. ‘కే ర్యాంప్‌’లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ పక్కా.. దీపావళి పండుగ పూట ఫ్యామిలీ మొత్తం థ...

కే ర్యాంప్.. కిరణ్ అబ్బవరం ర్యాంప్‌నో.. కుమార్ ర్యాంప్‌నో.. లేదంటే కు** ర్యాంప్‌నో.. ర్యాంప్‌కి ముందు తోక ఏదైనా కావచ్చు కానీ.. ముందు మాత్రం ఆడియన్స్‌కి కావాల్సింది ఎంటర్‌టైన్మెంట్. అదే పాయింట్‌తో మీకు హామీ ఇస్తున్నా.. ‘కే ర్యాంప్‌’లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ పక్కా.. దీపావళి పండుగ పూట ఫ్యామిలీ మొత్తం థియేటర్స్‌కి వచ్చి హాయిగా నవ్వుకుంటారని ప్రామిస్ చేశాడు కిరణ్ అబ్బవరం. ప్రామిస్ తప్పితే ఎలా ఉంటుందనే కో ఇన్సిడెంట్ కథే ‘K ర్యాంప్. కంటెంట్ పరంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లే పెద్దగా లేకపోయినా, ల్యాగ్ ఫీల్ ఉన్నా, ఎక్స్పెక్ట్ చేసే కథనమే ఉన్నా, ఓవరాల్ గా క్లైమాక్స్ వరకు దాదాపుగా మూవీ ఎంటర్టైన్ చేస్తుంది. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ‘కే ర్యాంప్’ అనిపించకపోయినా.. నిరాశపరచలేదు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ కే ర్యాంప్‌కి బాగా సెట్ అయ్యింది. కేరళ బ్యూటీని కెమెరాలో బంధించారు. ఓవరాల్ గా నవ్వుకోవడానికి మాత్రమే ఒకసారి ట్రై చేయొచ్చు.

Oct 18, 2025 Read Review
123telugu
123telugu Website
6

Above Average

K - Ramp movie Review

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె - ర్యాంప్ మూవీని జైన్స్ నాని డైరెక్ట్ చేయగా, యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఫక్తు కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ పరంగా అంతగా ఇంప్రెస్ చేయకపోయినా, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడా ట్రిమ్ చేయాల్సి ఉన...

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె - ర్యాంప్ మూవీని జైన్స్ నాని డైరెక్ట్ చేయగా, యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఫక్తు కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ పరంగా అంతగా ఇంప్రెస్ చేయకపోయినా, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడా ట్రిమ్ చేయాల్సి ఉన్నా, అన్ని సీన్లు ఎంటర్టైనింగ్ గా ఉండడం వల్ల పెద్దగా ఎడిట్ చేయలేదు. కానీ సన్నివేశాలు చాలా వరకు ఊహాజనితంగా ఉంటాయి. అందువల్ల కొత్తదనం కోరుకునే ఆడియన్స్ డిస్సపాయింట్ అవుతారు. అలాగే ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా ఉంటుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో అక్కడక్కడా డీసెంట్ ఎమోషనల్ టచ్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్ గా కొత్త కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆడియన్స్ డిస్సపాయింట్ అవుతారు. కథా, కథనాలతో సంబంధం లేకుండా నవ్వుకోవడానికి మాత్రమే ఈ సినిమా చూడొచ్చు.

Oct 18, 2025 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

కథ విషయానికి వస్తే... ఓ పెద్ద బిజినెస్ మెన్ అయినటువంటి కృష్ణ (సాయి కుమార్) కి అల్లరి చిల్లరగా తిరిగే "కుమార్ అబ్బవరం" (కిరణ్ అబ్బవరం) అనే కొడుకు ఉంటాడు. తన కొడుకును ప్రయోజకుడ్ని చేయాలనీ ఎంత ప్రయత్నించినా పని కాకపోయేసరికి, చివరి ప్రయత్నంగా కేరళలో ఓ ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ కొని తన కొడుకుని జాయిన్ చేయిస్తాడు. అయితే ఇక్కడ కూడా అలాగే ప్రవర్తిస్తుంటాడు. ఈ క్రమంలో ఇక్కడ పరిచయమైన మెర్సీ జాన్ (యుక్తి తరేజా) ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తనతో జీవితాంతం ఉంటానంటూ ప్రామిస్ చేసి లవ్ చేస్తాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. ఈ క్రమంలో మెర్సీ కి ఉన్న ఓ సమస్యతో కుమార్ కి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. మెర్సీ కి ఉన్న ఆ సమస్య ఏంటి? కుమార్ మెర్సీ వల్ల కలిగిన ఆ సమస్యలు ఎలా ఎదుర్కొన్నాడు. ఫైనల్ గా కుమార్ ప్రయోజకుడు అయ్యాడా? ఈ మధ్యలో కుమార్ తన నాన్న గురించి తెలుసుకుంది ఏంటి? మెర్సీ కి ఉన్న ఆ సమస్య తొలగిపోయి ఇద్దరు కలిసారా? అనేది కథ.

Technical values : కథ విషయానికి వస్తే.. ఇంచుమించు కిరణ్ అబ్బవరం గత సినిమాల్లో పాత్రల్లాగే కుమార్ పాత్ర కూడా ఉంటుంది. ఆ రోల్ లో కిరణ్ అబ్బవరం ఇమిడిపోయాడు. అలాగే సాయికుమార్, నరేష్, మురళీధర్ గౌడ్ ఎవరూ ఎక్కడా తగ్గకుండా మెప్పించారు. అలాగే యుక్తి తరేజా మెర్సీ రోల్ కి పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇక దర్శకుడు జైన్స్ నాని దర్శకుడిగా మంచి పనితీరు కనబరిచాడు. చిన్న కథని ఎంటర్టైనింగ్ గా మలచడంలో బాగా ఇంప్రెస్ చేసాడు. స్క్రీన్ ప్లే పరంగా సక్సెస్ అయ్యాడు. అలాగే సినిమా ప్రమోషన్స్ లో కూడా మేకర్స్ ప్రయత్నం ఫలించింది. 

నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ బాగుంది. అయితే మైనస్ పాయింట్స్ ఏంటంటే కథ చాలా రొటీన్ గా ఉండడం ఒకటైతే, మూవీ దాదాపుగా ఊహాజనితజంగా ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్ వరకు ఎంటర్టైనింగ్ గా ఉండడం వల్ల ల్యాగ్ ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అయితే రొమాంటిక్ డోస్ కొంచెం ఓవర్ అవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంత ఇబ్బందిగా ఉంటుంది. 

Final Review : ఓవరాల్ గా 'కే ర్యాంప్' ఆడియన్స్ ని నవ్వించడానికే థియేటర్లలోకి వచ్చిన ఒక టైం పాస్ ఎంటర్టైనర్ గా చెప్పొచ్చు. ఆడియన్స్ కిరణ్ అబ్బవరం కామెడీ కోసం, లేదా సరదాగా ఫ్యామిలీతో వీకెండ్ లో ఏదైనా సినిమా చూడడం కోసం కే ర్యాంప్ ని ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. కానీ ఏమాత్రం ఎక్కువ అంచనాలు పెట్టుకొని చూసినా డిస్సపాయింట్ అయ్యే అవకాశం ఉంది.

Review Statistics

6.0
Overall Rating
Avg. of all reviews
8
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
6.0/10
Public
N/A