Happy Raj (హ్యాపీ రాజ్)
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు కం హీరో జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హ్యాపీ రాజ్’. కామెడీ & లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలో విడుదలైంది.
Available in:
About This Movie
Story : కథ విషయానికి వస్తే... గ్రామీణ ప్రాంత యువకుడైన ఆనంద్ రాజ్ అలియాస్ హ్యాపీ (జీవీ ప్రకాశ్) తన తండ్రి ముత్తు (జార్జ్ మారన్) కారణంగా పలు అవమానాలు పడడమే కాకుండా, లవ్ బ్రేకప్ కూడా జరుగుతుంది. దీంతో ఆనంద్ బెంగుళూర్ కి వచ్చి జాబ్ చేస్తూ, అక్కడ కావ్య (శ్రీ గౌరి ప్రియ) అనే సాఫ్ట్‌వేర్ కొలీగ్ తో ప్రేమలో పడుతాడు. తను కూడా ప్రేమిస్తుంది. అయితే పెళ్లి కోసం ఏర్పాటు చేసిన ఫ్యామిలీ మీటింగ్ లో కావ్య తండ్రి రాజేశ్ (అబ్బాస్) ముత్తును అవమానిస్తాడు. దాంతో కావ్య, రాజ్ మధ్య దూరం పెరుగుతుంది. అసలు ఆనంద్ రాజ్ లైఫ్ లో తండ్రికి జరిగే అవమానాలు ఏంటి? తండ్రి మోసిన అవమాన భారాన్ని రాజ్ ఎలా తగ్గించాడు? చివరకు రాజ్ - కావ్యాలు కలిసారా లేదా అనేది కథ.
సినిమా కథ పరంగా.. చిన్న కథే అయినా డైరెక్టర్ ఎంటర్టైనింగ్ గా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించారు. దాంతో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్ గా చక్కగా చూపించారు. లవ్ స్టోరీ బాగానే ఉన్నా, తండ్రి కొడుకుల ఎమోషన్స్ పైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టినట్టుంది. జి.వి. ప్రకాష్, శ్రీ గౌరి ప్రియ తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. దాంతో పాటు జార్జ్ మరియన్, అబ్బాస్ తమ పాత్రల్లో మెప్పించారు.
ఇక సినిమాలో ఎంటర్టైనింగ్ గా కంటెంట్ బాగున్నా, కొన్ని లాజిక్ లేని సీన్లు ఆడియన్స్ కి ఎక్కవు. హీరో హీరోయిన్ల మధ్య గొడవలకు సరైన కారణం ఉండదు. ఇక దర్శకుడు మరియా రాజ ఇళంజెళియన్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామాను అందించడానికి ట్రై చేసినా, కొంచెం తడబడ్డాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ప్లస్ అవుతుంది. ఓవరాల్ గా చూస్తే.. ‘హ్యాపీ రాజ్’ కొంతవరకు ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది. డీసెంట్ ఫామిలీ స్టోరీస్ ని ఇష్టపడే ఆడియన్స్, రెగ్యులర్ మూవీ లవర్స్ ని హ్యాపీ రాజ్ మూవీ ఆకట్టుకుంటుంది.