గోదారి గట్టుపైన (Godari Gattupaina)
మేం ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కింది. జగపతి బాబు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో నిధి ప్రదీప్ హీరోయిన్ గా నటించగా తాజాగా థియేటర్లలో విడుదలైంది.
Available in:
Reviews
What critics and the public are saying about గోదారి గట్టుపైన (Godari Gattupaina)
Media Reviews
1 Avg: 5.0/10Average
Godari Gattupaina Movie Review
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తాజాగా థియేటర్లలో రిలీజ్ కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే రొటీన్ కథా కథనాలతో సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. గోదావరి నేటివిటీ బాగానే...
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తాజాగా థియేటర్లలో రిలీజ్ కాగా, మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే రొటీన్ కథా కథనాలతో సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. గోదావరి నేటివిటీ బాగానే చూపించినా ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఆసక్తిగా చూపించలేకపోయారు.
ఓవరాల్ గా “గోదారి గట్టుపైన’’ అంటూ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, ప్రేమ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుమంత్ ప్రభాస్, జగపతి బాబు నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
కథ విషయానికి వస్తే... శ్యామ్ బాబు (జగపతి బాబు)కి తన కూతురు మాయ (నిధి ప్రదీప్) అంటే చాలా ఇష్టం. తన కూతురిపై ప్రేమ తప్ప కోపాన్ని ఎప్పుడూ చూపడు. చిన్న ఉద్యోగం చేస్తూ కూతుర్ని ఉన్నంతలో మారాణిలా చూసుకుంటాడు. ఇటు మాయకి కూడా నాన్నంటే ఎంతో ప్రేమ. మరోవైపు రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో నడుపుకునే కుర్రాడు. రాజు తన చెల్లి సమైఖ్య(శ్రీలాస్య) ద్వారా పరిచయమైన మాయని ప్రేమిస్తాడు. మాయ కూడా రాజుని ప్రేమిస్తుంది. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజు - మాయ ప్రేమ మధ్య అడ్డొచ్చిన తండ్రి శ్యామ్ బాబు కూతురి విషయంలో తప్పు జరుగుతోందా అని బాధపడుతుంటాడు. ఇటు మాయ కూడా తండ్రి ఇచ్చిన స్వేచ్ఛని తప్పుగా వాడుకుంటున్నానేమో అని బాధతో రాజుకి దూరమవుతుంది. మరి శ్యామ్ బాబు తన కూతుర్ని అర్ధం చేసుకున్నాడా? చివరికి రాజు-మాయ ఒక్కటయ్యారా? లేదా అనేది కథ.
సినిమా కథ విషయానికి వస్తే... అందరికి తెలిసిన మాములు కథే. ఓ సగటు తండ్రి.. కూతుర్ని మహారాణిలా చూస్కుంటే... మధ్యలో పెళ్లి టైమ్ వచ్చేసరికి కూతురి జీవితంలో కొత్త వ్యక్తి... ఇటు ప్రేమికుడు, తండ్రి మధ్యలో నలిగిపోయే కూతురు... సింపుల్ కథ... కానీ ఈ సినిమాలో సగటు ఆడపిల్ల తండ్రికి ఉండే ఎమోషన్ ని సరిగ్గా చూపించారు. ముఖ్యంగా తండ్రి పాయింట్ అఫ్ వ్యూ లో సీన్స్ చాలా బాగా చూపించారు. ఇక హీరో హీరోయిన్ల మధ్య సీన్స్ కథ పరంగా రొటీన్ గా ఉన్నా ఆకట్టుకున్నాయి. ఇటు మేం ఫేమస్ తో ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్ ఈ సినిమాతోనూ న్యాచురల్ పెర్ఫార్మన్స్ తో అలరించాడు. హీరొయిన్ నిధి నటన పరంగా మెప్పిచింది. వీళ్ళు కాకుండా ప్రత్యేక పాత్రలో నటించిన జగపతిబాబు తన పెర్ఫార్మన్స్ తో మూవీకి బ్యాక్ బోన్ గా నిలిచారు. ఇక రాజీవ్ కనకాల, లైలా, దేవిప్రసాద్, మిగతా నటీనటులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
ఇక సినిమాలో నటీనటుల పెర్ఫార్మన్స్ పై బాగానే శ్రద్ధ పెట్టిన దర్శకుడు సుభాష్ చంద్ర ఆ స్థాయిలో స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు. కథలో కొత్తదనం లేకపోయినా, ట్రీట్మెంట్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి కానీ. అలాగే మూవీ లో మెయిన్ లీడ్స్ రోల్స్ క్యారెక్టర్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది. జగపతిబాబు పాత్ర తప్ప హీరో హీరోయిన్ల రోల్స్ కూడా గుర్తుండే విధంగా ఉండవు. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎమోషనల్ గా మలిచే అవకాశం ఉన్నా... సింపుల్ గా ముగించినట్టు అనిపిస్తుంది.
Technical values : ఇక టెక్నికల్ గా డైరెక్టర్ సుభాష్ చంద్ర తన టేకింగ్ తో మెప్పించినా, సరైన స్టోరీ, స్క్రీన్ ప్లే రాసుకోవాల్సింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీకృష్ణ ఇచ్చిన బీజీఎమ్ బాగుంది. పాటలు పర్లేదు. సినిమాలో గోదారి సన్నివేశాలు మంచి ప్లస్ అయ్యాయి. అక్కడక్కడా కొన్ని సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Final Review :
ఓవరాల్ గా "గోదారి గట్టుపైన" అంటూ థియేటర్లోకి వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ అండ్ ఫామిలీ డ్రామా రెగ్యులర్ మూవీ లవర్స్ ని మెప్పించేలా ఉంది. కానీ ఫ్రెష్ కంటెంట్ కోరుకునే ఆడియన్స్ డిస్సపాయింట్ అవుతారు. తక్కువ అంచనాలు పెట్టుకుని థియేటర్లో ఓసారి చూసేయొచ్చు.