Register as a Reviewer
గాయపడ్డ సింహం (Gayapadda Simham)

గాయపడ్డ సింహం (Gayapadda Simham)

01 May 2026
Overall Rating
5.0/10
2 Reviews

దర్శకనటుడు 'తరుణ్ భాస్కర్' హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గాయపడ్డ సింహం". మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా తాజాగా థియేటర్లలో విడుదలైంది.

Director: Kasyap Sreenivas
Cast: Sree Vishnu, Tharun Bhascker, J.D.Chakravarthy, Faria Abdullah, Maanasa Choudhary, Kasyap Sreenivas and others

Available in:

Reviews

What critics and the public are saying about గాయపడ్డ సింహం (Gayapadda Simham)

Media Reviews

2 Avg: 5.0/10
Gulte
Gulte Website
4

Below Average

Gayapadda Simham Movie Review

తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ సినిమా తాజాగా థియేటర్లలోకి రాగా… ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు Kashyap Srinivas తీసుకున్న కథ, స్క్రీన్‌ ప్లే పూర్తిగా రొటీన్‌ గా ఉండి పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. సినిమాలో కొన్ని కా...

తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ సినిమా తాజాగా థియేటర్లలోకి రాగా… ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు Kashyap Srinivas తీసుకున్న కథ, స్క్రీన్‌ ప్లే పూర్తిగా రొటీన్‌ గా ఉండి పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. సినిమాలో కొన్ని కామెడీ సీన్స్, ముఖ్యంగా Sree Vishnu గెస్ట్ రోల్ ఉన్న ట్రాక్ కాస్త రిలీఫ్ ఇచ్చినా… అవి కూడా మొత్తం సినిమాను మోసేంత బలం చూపించలేకపోయాయి. కథలో కొత్తదనం లేకపోవడం, సింపుల్ స్టోరీని కూడా ఆసక్తికరంగా చెప్పలేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది.


టెక్నికల్‌ గా ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించినా… సంగీతం పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే సాగదీత సీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా బోర్ ఫీల్ కలిగిస్తుంది. ఎడిటింగ్‌లో ఇంకా కట్స్ అవసరమనే ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్ గా ‘గాయపడ్డ సింహం’ = Routine story + slow narration! కొన్ని కామెడీ సీన్స్ తప్ప… సినిమా మొత్తంగా డిసప్పాయింట్ చేస్తుంది. కొత్తదనం ఆశించే వారికి ఇది పూర్తిగా మిస్ అయ్యే అవకాశం ఉంది.

May 01, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

GayapaddaSimham Movie Review

తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా గాయపడ్డ సింహం. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా, శ్రీవిష్ణు గెస్ట్ రోల్ లో నటించాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. కథ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండి కాస్త డిస్సపాయింట్ చేయగా... సినిమాలో ట్ర...

తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా గాయపడ్డ సింహం. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను కశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా, శ్రీవిష్ణు గెస్ట్ రోల్ లో నటించాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. కథ స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండి కాస్త డిస్సపాయింట్ చేయగా... సినిమాలో ట్రంప్ – శ్రీవిష్ణు ట్రాక్స్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. నటీనటుల నటన కూడా బాగానే ఉంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ అండ్ సింపుల్ స్టోరీ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. 


ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయ్. సంగీతం పర్లేదు. సాగదీత సీన్లు ఎడిట్ చేయాల్సింది. అయితే ఓవరాల్ గా ఈ గాయపడ్డ సింహం సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ మాత్రమే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. థియేటర్లలో ఒకసారి రెగ్యులర్ మూవీ లవర్స్ చూసేయొచ్చు. కానీ కొత్తదనం కోరుకునే వారికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు.

May 02, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

కథ విషయానికి వస్తే... ఎథికల్ హ్యాకర్ గా పనిచేసే దరహాస్ (తరుణ్ భాస్కర్) గాయత్రి (మానస చౌదరీ)తో ప్రేమలో పడుతాడు. అయితే అమెరికాలో సెటిల్ అయితేనే కూతుర్ని ఇచ్చి పెళ్ళిచేస్తానని గాయత్రి తండ్రి దరహాస్ కి కండిషన్ పెడతాడు. దీంతో ఎలాగైనా అమెరికాలో సెటిల్ అవ్వాలని దరహాస్ ప్రయత్నాలు చేయగా, అక్కడికి ఎలాగో వెళ్లినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని విధానాల వల్ల దరహాస్‌ ను ఎయిర్ పోర్ట్ నుండే తిరిగి పంపించేస్తారు. దాంతో లవ్ బ్రేకప్ అయిన దరహాస్ ట్రంప్ పై పగదీర్చుకోవాలని ప్లాన్ వేస్తాడు. మరి దరహాస్ అనుకున్న పని జరిగిందా? మధ్యలో ధర్మ (జెడి చక్రవర్తి) పాత్రేంటి? భైరవ్ దాస్ తో (శ్రీవిష్ణు) దరహాస్ ఏం చేయించాడు. ఈ ప్రయత్నాల్లో దరహాస్ లైఫ్ లోకి శాలిని (ఫరియా అబ్దుల్లా) ఎలా వచ్చింది. మరి దరహాస్ అనుకున్న ప్రయత్నాలు జరిగాయా లేదా? అనేది మిగిలిన కథ.

పక్కా ఎంటర్టైన్మెంట్ జోన్ లో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ని నవ్వించే విషయంలో మేకర్స్ కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. సినిమాలో తరుణ్ భాస్కర్ తన మార్క్ పంచ్ డైలాగ్స్ తో ఎప్పట్లాగే ఎనర్జిటిక్ గా నటించాడు. అలాగే గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన శ్రీవిష్ణు కూడా తన రోల్ లో బాగానే కామెడీ పండించాడు. తరుణ్ భాస్కర్ తో కామెడీ ట్రాక్ మంచి ప్లస్ అయింది. ఇక హీరోయిన్లుగా నటించిన ఫరియా అబ్దుల్లా, మానస చౌదరీ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసారు. అలాగే జె. డి. చక్రవర్తి, శుభలేఖ సుధాకర్ కీ రోల్స్ లో వాళ్ళ సీనియారిటీకి పదును పెట్టారు. అలాగే దర్శకుడిగానే కాకుండా సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించిన కశ్యప్ శ్రీనివాస్, అలాగే హర్షవర్ధన్ వాళ్ళ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు. 

అయితే దరహాస్ పాత్రను, శ్రీవిష్ణు కీ గెస్ట్ రోల్ పాత్రల్ని బాగానే రాసుకున్న దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ మిగతా పాత్రల్ని అంత ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించలేకపోయాడు. అలాగే కథా కథనాలు ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసుకొని ఉండాల్సింది. అలాగే సీన్ కి మరో సీన్ కి పొంతన లేక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే హీరోకి బలమైన ప్రత్యర్థి ఉంటే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఇక స్వీకర్ అగస్తి అందించిన సంగీతం పర్లేదు. కొన్ని సాగదీత సీన్లు ఎడిట్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. 

Final Review : ఓవరాల్ గా "గాయపడ్డ సింహం" అంటూ వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో తరుణ్ భాస్కర్, శ్రీ విష్ణు కామిక్ డైమింగ్స్ మినహా ఏవి పెద్దగా మెప్పించలేకపోయాయి. రెగ్యులర్ కామెడీ మూవీ లవర్స్ ఒకసారి చూసేలా మూవీ ఉంటుంది గాని, కొత్తదనం కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు. 

Review Statistics

5.0
Overall Rating
Avg. of all reviews
2
Total Reviews
From 1 Provider Types

Review Average

Media
5.0/10
Public
N/A
Why MRO?