Enugu Thondam Ghatikachalam (ఏనుగు తొండం ఘటికాచలం)
విలక్షణ దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ "ఏనుగుతొండం ఘటికాచలం". నరేష్ ప్రధాన పాత్రలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అలీ, రవిబాబు, వర్షిణి, శిరీష తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్ ఎస్ రాజేష్ సంగీతం అందించారు.
Available in:
Reviews
What critics and the public are saying about Enugu Thondam Ghatikachalam (ఏనుగు తొండం ఘటికాచలం)
Media Reviews
5 Avg: 4.6/10Below Average
Enugu Thondam Ghatikachalam movie Review
ఎనుగు తొండం – ఘటికాచలం రవిబాబు కెరీర్‌లో మరో ప్రయోగాత్మక చిత్రం. గతంలో పార్టీ, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి విభిన్న సినిమాలు చేసిన ఆయన, ఈసారి పూర్తిగా సీరియస్ నోట్లోకి వెళ్లాడు. నరేష్ లీడ్ రోల్‌లో తన అనుభవాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించాడు. కొన్ని సీన్స్‌లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకే హైలైట్. కథ నెమ...
ఎనుగు తొండం – ఘటికాచలం రవిబాబు కెరీర్‌లో మరో ప్రయోగాత్మక చిత్రం. గతంలో పార్టీ, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి విభిన్న సినిమాలు చేసిన ఆయన, ఈసారి పూర్తిగా సీరియస్ నోట్లోకి వెళ్లాడు. నరేష్ లీడ్ రోల్‌లో తన అనుభవాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించాడు. కొన్ని సీన్స్‌లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకే హైలైట్. కథ నెమ్మదిగా సాగినా, కొన్ని కీలక ఘట్టాలు బలంగా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్‌లో ల్యాగ్ స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఎడిట్ చేసి ఉంటే పేస్ మెరుగయ్యేది. రవిబాబు గత సినిమాల్లో ఉన్న సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఇక్కడ కొంచెం తక్కువ. అయినప్పటికీ, కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇష్టపడేవారు ఓసారి చూడవచ్చు.
Below Average
Enugu Thondam Ghatikachalam Movie Review
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఎనుగు తొండం – ఘటికాచలం ఆయన పాత సినిమాల మాదిరిగానే డార్క్, రియలిస్టిక్ టోన్‌లో సాగుతుంది. అనసూయ, అమరావతి, అవును లాంటి సినిమాల్లో కనిపించిన ఇంటెన్సిటీ ఇక్కడ కూడా కనిపిస్తుంది. సీనియర్ నటుడు నరేష్ మెయిన్ లీడ్‌లో చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కథ పెద్దగా కొత్తగా లేకపో...
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఎనుగు తొండం – ఘటికాచలం ఆయన పాత సినిమాల మాదిరిగానే డార్క్, రియలిస్టిక్ టోన్‌లో సాగుతుంది. అనసూయ, అమరావతి, అవును లాంటి సినిమాల్లో కనిపించిన ఇంటెన్సిటీ ఇక్కడ కూడా కనిపిస్తుంది. సీనియర్ నటుడు నరేష్ మెయిన్ లీడ్‌లో చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కథ పెద్దగా కొత్తగా లేకపోయినా, పాత్రలోని భావోద్వేగాలను నరేష్ బాగా పండించాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకి సరైన మూడ్‌ని సెట్ చేశాయి. అయితే రవిబాబు మార్క్ షాకింగ్ సీన్స్ కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే స్లోగా మారి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. సపోర్టింగ్ క్యాస్ట్‌కి తక్కువ స్కోప్ ఉంది. క్లైమాక్స్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. మొత్తానికి, ఇది రవిబాబు స్టైల్ ఇష్టపడేవారికి నచ్చే సినిమా.
Average
Enugu Thondam Ghatikachalam movie Review
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఎనుగు తొండం – ఘటికాచలం ఒక సీరియస్, రా టోన్‌తో తెరకెక్కిన సినిమా. సీనియర్ నటుడు నరేష్ మెయిన్ లీడ్‌గా కనిపించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఆయన నటనలో సహజత్వం, అనుభవం స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఎమోషనల్ మరియు ఇంటెన్స్ సీన్స్‌లో నరేష్ క్యారీ చేసిన విధానం ప్రశంసనీయం. రవిబాబు తన...
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఎనుగు తొండం – ఘటికాచలం ఒక సీరియస్, రా టోన్‌తో తెరకెక్కిన సినిమా. సీనియర్ నటుడు నరేష్ మెయిన్ లీడ్‌గా కనిపించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఆయన నటనలో సహజత్వం, అనుభవం స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఎమోషనల్ మరియు ఇంటెన్స్ సీన్స్‌లో నరేష్ క్యారీ చేసిన విధానం ప్రశంసనీయం. రవిబాబు తన స్టైల్‌లో కథను నేరుగా చెప్పే ప్రయత్నం చేశాడు, కానీ కొన్ని చోట్ల అదే స్టైల్ భారంగా అనిపిస్తుంది. కథ కొత్తదేమీ కాకపోయినా, ట్రీట్‌మెంట్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కీలక సన్నివేశాలకు బలం ఇచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా వాతావరణాన్ని బాగా చూపించింది. అయితే స్క్రీన్‌ప్లే స్లోగా సాగడం, కొన్ని సీన్స్ అనవసరంగా లాగినట్టు అనిపిస్తాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కు సరైన డెవలప్‌మెంట్ లేకపోవడం మైనస్. క్లైమాక్స్ ఇంకా బలంగా ఉండి ఉంటే ఇంపాక్ట్ పెరిగేది. మొత్తం మీద, లోపాలు ఉన్నప్పటికీ నటనను ఇష్టపడే వారికి ఓసారి చూడదగిన సినిమా.
Average
Enugu Thondam Ghatikachalam movie Review
ఫిలిం మేకర్ గా తనకంటూ ఓ బ్రాండ్ వాల్యూ ఏర్పరచుకున్న రవిబాబు డైరెక్టర్ గా కొన్నాళ్లుగా ఫామ్ లో లేకపోగా, తాజాగా ఏనుగు తొండం ఘటికాచలంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. రవిబాబు లాంటి ఫిల్మ్ మేకర్ నుంచి రావాల్సిన సినిమా అసలు కాదిది. ఓవరాల్ గా నరేష్ ఎప...
ఫిలిం మేకర్ గా తనకంటూ ఓ బ్రాండ్ వాల్యూ ఏర్పరచుకున్న రవిబాబు డైరెక్టర్ గా కొన్నాళ్లుగా ఫామ్ లో లేకపోగా, తాజాగా ఏనుగు తొండం ఘటికాచలంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. రవిబాబు లాంటి ఫిల్మ్ మేకర్ నుంచి రావాల్సిన సినిమా అసలు కాదిది. ఓవరాల్ గా నరేష్ ఎప్పటిలానే సహజనటనతో మెప్పించాడు. పైగా తన వయసుకి తగ్గ పాత్రది. వర్షిణి పాత్రలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నా, ఆ పాత్ర ఈ డ్రామాలో చలాకీగా ఉంటుంది. మిగతా పాత్రలన్నీ తేలిపోయాయి. దాదాపు సింగిల్ లొకేషన్ కథ ఇది. ప్రొడక్షన్ డిజైన్‌లో రవిబాబుదీ ప్రత్యేకమైన స్టైల్. ఇందులోనూ ఒక యూనిఫామ్ టోన్ కనిపిస్తుంది. మ్యూజిక్, కెమెరా వర్క్ ఓటీటీ సినిమాకి తగ్గట్టుగానే ఉంటాయి. పెద్దగా నవ్వురాని, ఎమోషన్‌గా కనెక్ట్ కాని సినిమా ఇది. రవిబాబు ఏదో మ్యాజిక్ చేస్తాడనే అంచనాతో చూస్తే మరింత నిరుత్సాహపడాల్సి వస్తుంది.
Average
Enugu Thondam Ghatikachalam Movie Review
దర్శకుడు రవిబాబు తన మార్క్ కామెడీ ఇంకా థ్రిల్లర్ చిత్రాలతో మంచి బెంచ్ మార్క్ ని సెట్ చేసుకున్నారు. ఇప్పుడొస్తున్న డిఫరెంట్ థ్రిల్లర్ మూవీస్ ని ఇరవైఏళ్ళ కిందటే రవిబాబు ఎప్పుడో తాను టచ్ చేశారు. కానీ కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయిన రవిబాబు మరోసారి తన సత్తా చాటాలని ‘ఏనుగు తొండం ఘటికాచలం’ అంటూ కామెడీ ఎంటర్టై...
దర్శకుడు రవిబాబు తన మార్క్ కామెడీ ఇంకా థ్రిల్లర్ చిత్రాలతో మంచి బెంచ్ మార్క్ ని సెట్ చేసుకున్నారు. ఇప్పుడొస్తున్న డిఫరెంట్ థ్రిల్లర్ మూవీస్ ని ఇరవైఏళ్ళ కిందటే రవిబాబు ఎప్పుడో తాను టచ్ చేశారు. కానీ కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయిన రవిబాబు మరోసారి తన సత్తా చాటాలని ‘ఏనుగు తొండం ఘటికాచలం’ అంటూ కామెడీ ఎంటర్టైనర్ తో ఓటిటి ద్వారా ఆడియన్స్ ని పలకరించాడు. కానీ ఈసారి కూడా నిరాశే మిగిలింది. పూర్తి స్థాయిలో ఆకట్టుకోని కామెడీ డ్రామాగా ఈ సినిమా నిలిచింది. దర్శకుడు రవిబాబు తాలూకా గత సినిమాలు తన క్రియేటివిటీ కోసం మినిమమ్ ఐడియా ఉన్నవారికి కూడా ఈ సినిమా నిరుత్సాహాన్నే మిగులుస్తుంది. ఇక ఏ అంచనాలు లేని ఆడియెన్స్ అయితే కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా తక్కువే. సో ఈ చిత్రం కేవలం రవిబాబు సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు కొత్త సినిమా చూడాలి అనుకునే వారినే చాలా తక్కువ స్థాయిలో ఆకట్టుకుంటుంది.
Public Reviews
Avg: —No public reviews yet.
About This Movie
ఏనుగు తొండం ఘటికాచలం (నరేష్) రిటైర్ అయ్యాక తన కొడుకులు, కోడళ్ళతో మనవాళ్లతో కలిసి ఉంటాడు. దాదాపు 65 యేళ్ళున్న ఘటికాచలం పోయిన తన భార్యను తలచుకుంటూ ఒంటరితనం అనుభవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ ఇంట్లోనే పని మనిషి భవాని (వర్షిణి) కూడా ఉంటుంది. అయితే ఘటికాచలం కుటుంబంలో ఒకానొక సమయంలో ఎవ్వరూ పనిచేయకుండా ఘటికాచలం పెన్షన్ డబ్బుతోనే తన కొడుకులు కోడళ్ళు కుటుంబాన్ని నెట్టుకొస్తారు. పైగా ఘటికాచలాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. ఈ క్రమంలో పని మనిషి భవాని, ఘటికాచలంను మభ్యపెట్టి ప్లాన్ చేసి తనతో పెళ్లి జరిపించుకుంటుంది. అయితే పెళ్లి జరిగిన రోజు రాత్రి అకస్మాత్తుగా చనిపోయిన ఘటికాచలం వల్ల, మొత్తం కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది. మరి ఆ ఇబ్బందులేంటి? ఘటికాచలం చనిపోవడం వల్ల కుటుంబం పరిస్థితి ఎలా మారింది అనేది కథ.
Technical values : ఇండస్ట్రీ లో రవిబాబు సినిమాలకు ఓ సపరేట్ బ్రాండ్ వాల్యూ ఉండేది. కానీ టైటిల్ కార్డ్స్ నుండి, ఇంటర్వెల్ ట్విస్ట్ లు సహా క్లైమాక్స్ వరకు ఇంట్రస్టింగ్ గా ఆడియన్స్ ని సీట్లలో కూర్చోబెట్టగలడు. కాని కొన్నాళ్లుగా తన మార్క్ మూవీస్ ఇవ్వడంలో విఫలమవుతున్నాడు. ఇప్పుడు ఏనుగుతొండం ఘటికాచలంతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాడు. కానీ మళ్ళీ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాడు. ఇక సినిమాలో లీడ్ నటీనటులు సీనియర్ నటుడు నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ అలానే వర్షిణి ఇంకా గిరిధర్, విజయ్ భాస్కర్ తదితరులు తమ పరిధి మేరకు బానే చేశారు.
ఇక టెక్నికల్ గా దర్శకుడు రవిబాబు తన మార్క్ ఈ సినిమాలో చూపించడానికి ట్రై చేసినా కొత్తదనం లేని కామెడీతో విసుగు పుట్టించాడు. ఈ సినిమాలో కథ కథనాలు కూడా నిరాశ కలిగించే విధంగా ఉన్నాయి. రవిబాబు గత చిత్రాలు అల్లరి, మనసారా, నువ్విలా లాంటి సినిమాల్లో కామెడీ ఎంతో నాచురల్ గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో పూర్తిగా మిస్ అయింది. అలీ లాంటి సీనియర్స్ కమెడియన్స్ ఉన్నా ఎక్కడ కూడా ఫన్ జెనరేట్ కాలేదు. అలాగే ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్లేదు.
సంగీతం, సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. కానీ ఎడిటర్ సినిమాని బాగా ట్రిమ్ చేయాల్సింది. అప్పుడెప్పుడో అవును సినిమాతో హిట్ కొట్టిన రవిబాబు మళ్ళీ ఫామ్ లోకి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు.
Final Review :
ఇక ఓవరాల్ గా "ఏనుగు తొండం ఘటికాచలం" ఆడియన్స్ ని అలరించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి. దర్శకుడు రవిబాబు గత సినిమాల్లో ఉన్న క్రియేటివిటీ ఇందులో ఏమాత్రం కనిపించలేదు. మొత్తంగా రవిబాబు సినిమాలు ఇష్టపడే ఒక వర్గం ఆడియన్స్ కి ఈ సినిమా కొంత వరకు కనెక్ట్ అవుతుందేమో గాని, నార్మల్ ఆడియన్స్ ఆదరించలేరు.