Register as a Reviewer
Dacoit (డెకాయిట్)

Dacoit (డెకాయిట్)

Upcoming Expected Release: 10 Apr 2026

Dacoit Releasing Soon : మోస్ట్ క్రేజీయెస్ట్ యాక్షన్ థ్రిల్లర్... ఈ వారమే థియేటర్లలో...

Director: Shaneil Deo
Cast: Adivi Sesh, Mrunal Thakur, Anurag Kashyap, Prakash Raj, Sunil, Atul Kulkarni, Zayn Marie Khan, Kamakshi Bhaskarla

Available in:

About This Movie

 

టాలీవుడ్ యంగ్ స్టార్ అడవి శేష్ (Adavisesh) హీరోగా నటించిన "డెకాయిట్" (Dacoit) సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడాది కాలంగా వాయిదా పడుతూ రీ షూట్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అయింది. ఈ మూవీ నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ సహా అన్నీ అంచనాలను పెంచేయగా, ఫైనల్ గా థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. మృణాల్ ఠాకూర్ (Mrunal thakur) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్ కం యాక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag kashyap) తో పాటు, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్ వంటి స్టార్స్ కీ రోల్స్ లో నటించారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే... కథ కాన్సెప్ట్ ఏంటో ఆల్మోస్ట్ ట్రైలర్ లో చెప్పేసారు. హరి (అడివి శేష్), జూలియట్ (మృణాల్ ఠాకూర్) లు ఇద్దరు దొంగలుగా ట్రైలర్ లో చూపించబడ్డారు. అలాగే ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ.. ఉండి... వాళ్ళ మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోవడం, హరీష్ జైలుకి వెళ్లడం, జూలియట్ తన కూతురుతో వేరే లైఫ్ లీడ్ చేయడం... మళ్ళీ ఓ క్లిష్ట పరిస్థితిలో కలుసుకోవడం.. ట్రైలర్ లో చూపించారు. ఆ అనుకోని పరిస్థితుల్లో హరి - జూలియట్ వాళ్ళ వాళ్ల కోసం మళ్ళీ నేర ప్రపంచంలోకి అడుగు పెట్టడం... దాని తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు వంటివి ట్రైలర్ లో హైలెట్ గా చూపించారు. 

ముఖ్యంగా ట్రైలర్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ సహా వాళ్ళ మధ్య ఎమోషనల్ బాండింగ్, వాళ్ళ కళ్ళల్లో కోపం, నిస్సహాయత లాంటివి హైలెట్ అయ్యాయి. అలాగే ట్రైలర్ లో చూపించిన స్టైలిష్ యాక్షన్ షాట్స్ హైలెట్ అయ్యాయి. ఓవరాల్ గా సినిమాలో హరి, జూలియట్ మళ్ళీ కలుస్తారా లేదా అన్నది మెయిన్ పాయింట్ గా ఉండే అవకాశం ఉంది. ఇక అడవి శేష్ కూడా స్పై థ్రిల్లర్స్ జోన్ దాటి యాక్షన్ మూవీతో ఫస్ట్ టైం వస్తుండగా, ఇండస్ట్రీ లో ఈ సినిమా మినిమం గ్యారెంటీ అన్న అంచనాలున్నాయి. ఇక డెకాయిట్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు. కాగా ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.