Register as a Reviewer
Avatar 3 Fire And Ash (అవతార్ 3 ఫైర్ అండ్ అష్)

Avatar 3 Fire And Ash (అవతార్ 3 ఫైర్ అండ్ అష్)

19 Dec 2025
Overall Rating
5.5/10
8 Reviews

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన "అవతార్" ఏ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించిందో తెలిసిందే. విజువల్ వండర్ గా మరో ప్రపంచానికి తీసుకెళ్లే ఆ సినిమా రికార్డుల వర్షం కురిపించింది. దానికి సీక్వెల్ గా వచ్చిన పార్ట్2 కూడా అదే స్థాయిలో మెప్పించగా, ఇప్పుడు మూడో పార్ట్ కూడా అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ పేరిట తీసుకొచ్చారు. మరి ఆడియన్స్ ని ఏ విధంగా మెప్పించిందో చూద్దాం.

Director: James Cameron
Cast: Sam Worthington, Zoe Saldaña, Sigourney Weaver, Stephen Lang, Kate Winslet

Available in:

Reviews

What critics and the public are saying about Avatar 3 Fire And Ash (అవతార్ 3 ఫైర్ అండ్ అష్)

Media Reviews

2 Avg: 6.0/10
Thyview
Thyview Youtube Channel
6

Above Average

Avatar 3 Fire And Ash Movie Review

అవతార్ సిరీస్ లో భాగంగా వచ్చిన మూడో పార్ట్ అవతార్ 3 ఫైర్ అండ్ యష్ ఫ్యాన్స్ ని బాగానే మెప్పించింది. అయితే కథనంలో తడబడ్డారు. రన్ టైం ఎక్కువ ఉండడం వల్ల బోర్ ఫీల్ వస్తుంది. అయితే ఓవరాల్ గా నాలుగో పార్ట్ అక్కర్లేదు ఇక చాలు అనేలా పార్ట్ 3 ఉంది.

అవతార్ సిరీస్ లో భాగంగా వచ్చిన మూడో పార్ట్ అవతార్ 3 ఫైర్ అండ్ యష్ ఫ్యాన్స్ ని బాగానే మెప్పించింది. అయితే కథనంలో తడబడ్డారు. రన్ టైం ఎక్కువ ఉండడం వల్ల బోర్ ఫీల్ వస్తుంది. అయితే ఓవరాల్ గా నాలుగో పార్ట్ అక్కర్లేదు ఇక చాలు అనేలా పార్ట్ 3 ఉంది.

Dec 20, 2025 Watch
123telugu
123telugu Website
6

Above Average

Avatar 3 Fire And Ash Movie Review

అవతార్ సిరీస్ లో భాగంగా జేమ్స్ కెమెరున్ తెరకెక్కించిన అవతార్ 3 క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

Dec 20, 2025 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

అవతార్ ఫస్ట్ పార్ట్ లో వేరే ప్రపంచంలో ఉన్న అడవులను, సెకండ్ పార్ట్ లో సముద్రాల్ని చూపించిన దర్శకుడు మూడో పార్ట్ లో 'అగ్ని' ని ప్రధానంగా చూపించాడు. పండోర గ్రహంలో అగ్నిజాతి (యాష్ పీపుల్) అనే కొత్త రకం తెగ ఈ స్టోరీలో ఎంట్రీ ఇస్తారు. వీళ్ళు కనిపించేంత బాగానే ఉన్నా, క్రూరులు, మూర్ఖులు. ఇక కథలోకి వెళ్తే "జేక్ సల్లీ" తన భార్య "నేతిరి" తో పాటు తన కుటుంబంతో సముద్ర జాతులతో జీవిస్తుంటాడు. అయితే జేక్ సల్లీ పెద్ద కొడుకు నెటెయమ్ చావుకి అతని చిన్న కొడుకు లోక్ కారణం అని భావిస్తాడు. ఇదిలా ఉండగా జేక్ కూతురు కిరి, ఆని పెంపుడు కొడుకు స్పైడర్ మధ్య జరిగిన కథ ఏంటి? జేక్ పై పగతో రగిలిపోతున్న క్వారిచ్ తన పగను తీర్చుకోవడానికి  ఏం చేసాడు. మొత్తంగా కార్విచ్ - వరాంగ్ తో కలిసి జేక్ సల్లీ కుటుంబాన్ని ఏం చేసారు. జేక్ తన కుటుంబాన్ని వాళ్ళ నుండి కాపాడుకున్నారా లేదా అనేది కథ.

Technical Values :  ఎప్పట్లాగే చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ తన మేకింగ్ తో ఆకట్టుకున్నారు. విజువల్స్ మొదటి రెండు పార్ట్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. పంచ భూతాల్లో ఒకటైన అగ్నిని పార్ట్ లో మెయిన్ గా చూపించడం బాగుంది. అయితే స్క్రీన్ ప్లే పరంగా ఇంతకు ముందు వాటిలా 3వ పార్ట్ మెప్పించలేకపోయింది. మెయిన్ గా 3.20 గంటల మూవీ నిడివి మైనస్ అయింది. ప్రేక్షకుల్ని ఇంతసేపు డైరెక్టర్ కూర్చోబెట్టలేకపోయాడు. అంతే కాదు కథా, కథనాల్లో బలం లోపించగా, ఎమోషనల్ డెప్త్ ఏమాత్రం కనెక్ట్ కాలేదు. పైగా ఇందులో కొన్ని డైలాగ్స్ కామన్ ఆడియన్స్ కి అర్ధం కాలేదు. అయితే టెక్నికల్ పరంగా మేకర్స్ అందరూ బాగా కష్టపడ్డారని చెప్పాలి. ముఖ్యంగా మ్యూజిక్ విభాగంలో, VFX విభాగంలో అభినందించాలి. 

 

Final Review : వరల్డ్ వైడ్ హాలీవుడ్ మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన  "అవతార్: ఫైర్ అండ్ యాష్" థియేటర్లలో బాగానే సందడి చేస్తున్నా, ఇంతకు ముందు పార్ట్స్ కి తగ్గట్టు ఉందని ఆశించి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. అద్భుతమైన విజువల్స్, సూపర్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నా, కథనం విషయంలో కాస్త తడబడ్డారని చెప్పొచ్చు. అయితే ఎమోషన్స్ తగ్గినా, స్లో నేరేషన్ ఉన్నా, ఈ విజువల్ వండర్ ని ఖచ్చితంగా ఓసారి థియేటర్లో అయితే చూడచ్చు. 

Review Statistics

5.5
Overall Rating
Avg. of all reviews
8
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
6.0/10
Public
N/A