Home Reviews Chitrajyothy
C

Chitrajyothy

Movie Reviewer

10
Total Reviews
5.3/10
Avg Rating
Vishnu Vinyasam (విష్ణు విన్యాసం)

Vishnu Vinyasam movie Review

వాస్తు, జాతకాల నేపథ్యంలో వచ్చిన విష్ణు విన్యాసంలో కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా, బలమైన కథ లేకపోవడంతో సినిమా తేలిపోయింది. హీరో బలహీనతను ఉపయోగించుకునే పాత్రలు, హీరోయిన్ జాతకం చుట్టూ నడిచే డ్రామా ఉన్నప్పటికీ సన్నివేశాల్లో బలం కనిపించదు. ఇది పూర్తిగా శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో. తన కామెడీ టైమింగ్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. నయన్ సారిక ఓకే అనిపించగా, సత్య తదితరులు ఉన్నా సరిగ్గా ఉపయోగించుకోలేదు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ రధన్ మ్యూజిక్ గుర్తుండదు. రెండో భాగం రిపీట్ ఫీల్‌తో నెమ్మదిగా అనిపిస్తుంది. మొత్తంగా కథ కంటే కామెడీ కోసం చూసే వారికి, శ్రీ విష్ణు అభిమానులకు ఈ సినిమా ఓకే అనిపించవచ్చు

Feb 27, 2026 See on Movie Page
5

Average

Santhana Prapthirasthu (సంతాన ప్రాప్తిరస్తు)

Santhana Prapthirasthu Movie Review

ప్రస్తుత కాలంలో తీసుకునే ఆహారం, పని ఒత్తిడి లాంటి సమస్యలే సంతాన లేమికి కారణం అవుతున్నాయి. దాన్ని ప్రధానాంశంగా తీసుకుని లవ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఇది కాస్త సీరియస్‌ సబ్జెక్టే అయినా ఎక్కడా లిమిట్స్‌ క్రాస్‌ చేయకుండా, ఎవరినీ నొప్పించకుండా లైటర్‌ వేలో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే లవ్‌స్టోరీ పరంగా రొటీన్‌గానే అనిపిస్తుంది. పిల్లల్ని కోరుకోవడం, ఆ తరుణంలో సాగే భావోద్వేగ సన్నివేశాలు, పతాక సన్నివేశం కదిలించేలా ఉన్నాయి. కథ పరంగా మంచిదే అయినా కాస్త ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్‌లతో తీసుంటే ఈ సినిమా జనాల్లోకి బాగా వెళ్లేది. సినిమాలో నటీనటులు బాగానే పెర్ఫార్మ్ చేసినా, బలమైన పెద్ద ఆర్టిస్టులతో సినిమాని తీసుంటే, అప్పుడు ప్రమోషన్‌ బలంగా చేస్తే జనాలకు చేరువయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఒకసారి చూసేలా అయితే ఉంది.

Feb 05, 2026 See on Movie Page
5

Average

Cheekatilo (చీకటిలో)

Cheekatilo Movie Review

అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన 'చీకటిలో' మూవీలో శోభిత క్రైమ్ జర్నలిస్ట్ గా బాగానే చేసింది. సీఐ గా నటించిన చైతన్య కృష్ణ పాత్ర కాస్తంత బలమైంది. చాలా గ్యాప్ తర్వాత ఇషాచావ్లా మరోసారి కెమెరా ముందుకొచ్చింది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఆమె నటించింది. వడ్లమాని సాయి శ్రీనివాస్ పాత్ర ఇందులో భిన్నమైంది. నిజానికి ఈ సినిమాలో ప్రతిభగల నటీనటులు చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళను పూర్తి స్థాయిలో దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి ఉపయోగించుకోలేదు. శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం బాగుంది. సంభాషణలు అర్థవంతంగా ఉన్నాయి. 'తప్పు చేసి చీకట్లో దాక్కునే ఏ మృగాన్ని వదల కూడదు, మన భయం వాళ్ళకి బలంగా మారకూడదు' అనే పాయింట్ మీద తీసిన 'చీకటిలో...' మూవీ క్రైమ్, ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ ను ఇష్టపడే వారికి నచ్చే ఆస్కారం ఉంది. కాకపోతే భారీ అంచనాలు మాత్రం పెట్టుకోకూడదు.

Jan 24, 2026 See on Movie Page
5

Average

Mana Shankara Varaprasad Garu (మన శంకర వర ప్రసాద్ గారు)

Mana Shankara varaprasad garu movie review

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వర ప్రసాద్" సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. పండగకు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేలా ఈ సినిమా రూపొందగా, చిరు, వెంకీ కాంబో సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని చెప్పొచ్చు.

Jan 12, 2026 See on Movie Page
6

Above Average

Psych Siddharth (సైక్ సిద్ధార్థ్)

Psych Siddharth Movie Review

కొత్త తరహా పత్రాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే శ్రీ నందు ఈసారి సైక్ సిద్ధార్థ్ మూవీతో హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో ఇద్దరూ తమ తమ నటనతో ఇంప్రెస్ చేసారు. కానీ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ కాదు. సినిమా కోసం ఓ రకమైన ఫ్రస్ట్రేషనే వారిని ఈ పాత్రలు అంత బాగా చేయడానికి ప్రేరేపించి ఉండొచ్చు. ఇక సినిమాలో మిగిలిన పాత్రధారులు తెర మీద కొత్తగా కనిపించడంతో పాటు కాస్తంత భిన్నంగా నటించే ప్రయత్నం చేశారు. దర్శకుడు వరుణ్ రెడ్డి తాను తీయాలనుకున్న విధంగా సినిమాను తీసేశాడు... అంతే. స్మరణ్‌ సాయి నేపథ్య సంగీతం డిఫరెంట్ గా ఉండి, ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నా... మేకర్స్ కథ మీద ఇంకాస్తంత గట్టిగా వర్క్ చేసి ఉంటె బాగుండేది. కానీ సినిమాలో రొమాన్స్, కామెడీ పై మాత్రమే ఫోకస్ పెట్టగా, సినిమా కంటెంట్ ఆడియన్స్ కి చేరువ కాలేదు.

Jan 02, 2026 See on Movie Page
4

Below Average

Champion
Champion (2025) Movie Media

Champion Movie Review

రోషన్, అనస్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ సినిమా బైరాన్‌పల్లి తిరుగుబాటు నేపథ్యంలో తెరకెక్కగా, ప్రేక్షకుల నుండి మిక్సడ్ రివ్యూస్ తెచ్చుకుంది.

Dec 25, 2025 See on Movie Page
5

Average

Dhandoraa
Dhandoraa (2025) Movie Media

Dhandoraa Movie Review

చావు అనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాద, ఎలా బతికినా అది గొప్పగా ఉండాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమే దండోరా.

Dec 25, 2025 See on Movie Page
5

Average

Avatar 3 Fire And Ash
Avatar 3 Fire And Ash (2025) Movie Media

Avatar 3 Fire And Ash Movie Review

అవతార్ సిరీస్ కి కొనసాగింపుగా వచ్చిన అవతార్ ఫైర్ అండ్ ఆష్ థియేటర్లలో ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేకున్నా, విజువల్ వండర్ గా ఆకట్టుకుంది.

Dec 20, 2025 See on Movie Page
5

Average

Raju Weds Rambai(రాజు వెడ్స్ రాంబాయి)

Raju Weds Rambai Movie Review

యదార్థ ప్రేమకథలను, ప్రేమకథల్లో హృదయాలను బరువెక్కించే పతాక సన్నివేశాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. పెద్దగా అంచనాలు లేకుండా వెళితే సినిమా ఎక్కువ కనెక్ట్ అవుతుంది.

Nov 21, 2025 See on Movie Page
5

Average

Telusu Kada (తెలుసు కదా)

Telusu Kada Movie Review

దీపావళి స్పెషల్ గా రిలీజ్ అయిన తెలుసు కదా మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సిద్ధు జొన్నలగడ్డ మెచ్యూర్డ్ పాత్ర చేశాడు. కానీ అతని పాత్రను మరింత బాగా రాసుకుని ఉండాల్సింది. లైఫ్ లో చిల్ అవ్వాలనుకునే కేర్ ఫ్రీ గర్ల్ గా శ్రీనిధి శెట్టి బాగానే చేసింది. రాశీ ఖన్నా పాత్ర హుందాగానే సాగినా సెకండ్ హాఫ్ లోని ట్వస్ట్స్ అండ్ టర్న్ ను ఎక్స్ ప్రెస్ చేయడంలో లోటు కనిపించింది. హీరో స్నేహితుడిగా వైవా హర్ష బాగా చేశాడు. అతని పాత్రే సినిమాలో కొంత రిలీఫ్ ను ఇచ్చింది. ఎస్. థమన్ స్వరపర్చిన 'మల్లిక గంథ' సాంగ్ బాగుంది. నేపథ్య సంగీతం గురించి పెద్దంత చెప్పుకోవాల్సిందేమీ లేదు. జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ కూల్ గా ఉంది. ఓ సాధారణమైన కథను తన స్క్రీన్ ప్లేతో కొత్తగా చూపించడానికి నీరజ కోన ప్రయత్నం చేసింది. కానీ అది కన్ ఫ్యూజన్ కు గురిచేసింది. కథకు తగ్గట్టుగా నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. 'తెలుసు కదా' అని హీరో ఎంత చెప్పినా... ఏదో తెలియని భావనే ఆడియెన్ కు కలుగుతుంది.

Oct 17, 2025 See on Movie Page
5

Average