Register as a Reviewer
లెనిన్ (LENIN Teaser)

లెనిన్ (LENIN Teaser)

Upcoming Expected Release: 26 Jun 2026

లెనిన్ (LENIN Teaser) : అయ్యగారి కం బ్యాక్ కి టైం ఫిక్స్.. త్వరలో "మనోడు వస్తున్నాడు"...

Director: Murali Kishore Abburu
Cast: Akkineni Akhil, Bhagyashri Borse, Shivaji, Brahmaji, Getup Srinu, Rangasthalam Mahesh and others

Available in:

About This Movie

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఈసారి పక్కా ప్లానింగ్ తో రావడానికి రెడీ అయ్యాడు. లాస్ట్ టైం ఏజెంట్ తో భారీ ప్లాప్ అని అందుకున్న అఖిల్ బాగానే గ్యాప్ తీసుకుని ఇప్పుడు "లెనిన్" అంటూ ఆడియన్స్ ని పలకరించడానికి వస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఒక రూరల్ బ్యాక్‌ డ్రాప్ యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరెక్కనుండగా తాజాగా "లెనిన్" నుండి టీజర్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

 

ఇక టీజర్ లో అఖిల్ గ్రామీణ యువకుడిగా రాయలసీమ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులని అలరించబోతున్నాడు. ఊళ్ళో ఈవెంట్ ఆర్గనైజర్‌ గా లెనిన్ పాత్రలో అఖిల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక భారతి అనే రోల్ లో భాగ్యశ్రీ కనిపించనుండగా, టీజర్ లో వీళ్ళ మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. టీజర్ లో "నేను తప్పిపోయి రాలేదు... మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా".. అంటూ అఖిల్ చెప్పే డైలాగ్స్ మంచి అంచనాలు క్రియేట్ చేయగా, లాస్ట్ షాట్ లో యాక్షన్ కట్స్ బాగున్నాయి. 

 

ఇక లెనిన్ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తుండగా సినిమాలో శివాజీ, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, రంగస్థలం మహేశ్ తదితరులు కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణ లో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి  ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నాడు. కొంతకాలంగా ఫామ్ లో లేని అఖిల్ ఈ సినిమాతో ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. ఇక లైనిన్ సినిమాను జూన్ 26న ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి మేకర్స్ రెడీ చేస్తున్నారు.

Why MRO?